Hot Posts

6/recent/ticker-posts

సీఎం రేవంత్ చేతుల మీదుగా వన మహోత్సవం ప్రారంభం


తెలంగాణలో ప్రారంభమైన వన మహోత్సవం కార్యక్రమం

ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో మొక్కలు నాటిన సీఎం రేవంత్‌

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

HYDERABAD:తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వన మహోత్సవం’ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ స్వయంగా మొక్కను నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి కొండా సురేఖ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించి, అక్కడ ఒక రుద్రాక్ష మొక్కను నాటారు. కార్యక్రమం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi