ANDHRAPRADESH:వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని సూచించింది. తెలంగాణలోనూ మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు అన్ని జిల్లా లకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది.
అల్పపీడనం తీరం దాటంతో ఈ రోజు (శనివారం) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. కాగా, వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయవ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తరువాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేసారు. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా ముంచింగిపట్టులో గరిష్ఠంగా 46 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మి.మీ. కన్నా ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, అపరాల పంటల సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు. వాయుగుండం, భారీ వర్షాలపై శుక్రవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహ ణ శాఖల మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్య లు చేపట్టాలని ఆదేశించారు. కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షా లు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు..ఈరోజు,రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది. చినుకులు రోజంతా పడతాయి. ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షం పడే అవకాశముంది. మధ్య తెలంగాణలో మోస్తరు వర్షం రోజంతా కురుస్తుంది. హైదరాబాద్‌లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi