ANDHRAPRADESH:ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల విషయంలో ఎంత స్పీడుగా స్పందిస్తారన్నది మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో వివిధ వర్గాల నుంచి తనకు అందుతున్న ఫిర్యాదుల్ని ఇప్పటికే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా చర్యలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్.. మరోసారి అలాంటిదే ఓ కీలక సమస్యపై వేగంగా స్పందించారు.
ఏపీలోని విజయనగరానికి చెందిన సూర్యకుమారి అనే మహిళ ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఓ ఫిర్యాదుతో కలిసింది. ఆమె ఇద్దరు కుమారుల్ని మానవ అక్రమ రవాణా ముఠా ఎత్తుకుపోయి మయన్మార్ సరిహద్దులకు తీసుకుపోయి బంధించిందని సూర్యకుమారి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన తన కుమారుల్ని రక్షించాలని ఆమె పవన్ కళ్యాణ్ ను వేడుకుంది. దీంతో పవన్ వెంటనే స్పందించారు
మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని సూర్యకుమారి వేడుకోవడంతో పవన్ కేంద్రాన్ని సంప్రదించారు. తమ ఇద్దరు కుమారులతోపాటు మొత్తం 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు సూర్యకుమారి నుంచి అందిన ఫిర్యాదును విదేశీ వ్యవహారాలశాఖకు పంపారు. విదేశాంగశాఖ కూడా దీనిపై అంతే వేగంగా స్పందించింది.
మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని పవన్ చేసిన విజ్ఞప్తిపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని వెంటనే పవన్ కు హామీ ఇచ్చింది. దీంతో త్వరలోనే విదేశాంగశాఖ వీరిని వెనక్కి తీసుకొస్తుందని పవన్ సూర్యకుమారికి హామీ ఇచ్చి పంపారు. గతేడాది వచ్చిన పృధ్వీరాజ్ సుకుమారన్ సినిమా గోట్ లైఫ్ లోనూ ఇదే విధంగా గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోయి అరబ్ దేశాల్లో ఆయన పడిన ఇబ్బందులు, చివరికి సుదీర్ఘ ఇబ్బందుల తర్వాత భారత్ కు వెనక్కి వచ్చిన తీరు అంతా చూశారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi