AMARAVATI:అమరావతి నిర్మాణం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నిధుల సమీకరణ.. నిర్దేశిత లక్ష్యం మేరకు నిర్మాణాల దిశగా అడుగులు వేస్తోంది. రాజధానిలో కొత్త భవనాల డిజైన్లు.. నిర్మాణాల పైన నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే ప్రపంచ బ్యాంకు - ఏడీబీ తో పాటుగా హడ్కో నుంచి ఏపీ రాజధాని కోసం నిధుల సమీకరణ జరుగుతోంది. మరింతగా కేంద్రం నుంచి సహకారం ప్రభుత్వం ఆశిస్తోంది. ఇక.. రెండో విడత భూ సమీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఇప్పుడు ఢిల్లీ పర్యటన వేళ చంద్రబాబు అమరావతి పై కీలక చర్చలు చేయనున్నారు.
కొత్త లక్ష్యాలు
అమరావతి నిర్మాణాల పైన ప్రభుత్వం దశల వారీగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేసింది. ఇదే సమయంలో రాజధానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక.. అమరావతి "ఐకానిక్" వారధి నిర్మాణ అంచనా వ్యయం 2602.46 కోట్ల రూపాయలుగా తెలు స్తోంది. అదే విధంగా ఇంటర్నల్ రింగ్ రోడ్ అంచనా వ్యయం 8,800 కోట్ల రూపాయలుగా అంచ నా వేస్తున్నారు. నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి 500 కోట్ల రూపాయల వ్యయ అంచనాగా చెబుతున్నారు. వీటికి నిధుల సమీకరణ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో 20 కీలక పనుల కు పాలనా పరమైన అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ సమయంలో చంద్రబాబు ఈ నెల 14న ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్రంతో అమరావతికి నిధుల అంశం పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
నిధుల సమీకరణ
ఇప్పటికే కేంద్రం చొరవతో మంజూరు అయిన ప్రపంచ బ్యాంకు - ఏడీబీ రుణాన్ని కేంద్ర గ్రాంటు గా మార్చాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దీని పైన ఇప్పటికే మంతనాలు ప్రారంభమయ్యాయి. ఇక.. 31 మార్చి 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ-సంబంధిత అభివృద్ధి పనులన్నీ పూర్త య్యేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా 31 మార్చి 2027 నాటికి, తొలి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ హ్యాపీ నెస్ట్ పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మార్చి 2028 నాటికి లెజిస్లేచర్ భవనం, ప్రభుత్వ కార్యాలయాల టవర్లు పూర్తి చేయాలని టార్గెట్ గా నిర్ణయించారు. ఆ తరువాత ఇంటీరియర్ పనులు పూర్తి చేయనున్నారు. హైకోర్ట్ భవనం మొత్తం మార్చి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
తాజా నిర్ణయంతో
ఐకానిక్ భవనాలకు నిధుల అంశం పైన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ఇక.. అమరావతి తొలి గృహ ప్రవేశాల ముహూర్తం ఖరారు అయింది. 2026 సంక్రాంతి రోజున శుభముహూర్తం గా ప్రభు భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, హైకోర్ట్ జడ్జిలు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల బంగళాలు, అఖిల భారత సర్వీసుల అధికారుల నివాస సముదాయం 2026 జనవరి 15 నాటికి సిద్ధం చేయాలని నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు ఆర్దిక సమస్యలు రాకుండా కేంద్రం మద్దతు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi