Hot Posts

6/recent/ticker-posts

పవన్ డైరీలో వారి పేర్లు ఉంటాయట !


జనసేన 2014 మార్చి 14న పుట్టింది. ఇప్పటికి సరిగ్గా పుష్కర కాలం అయింది. మరి నాటి నుంచి నేటి దాకా పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.

ANDHRAPRADESH:జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక డైరీ మెయింటెయిన్ చేస్తున్నారా అంటే అవును అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఏపీలో రెడ్ బుక్ అన్నది ప్రచారంలో ఉంది. రెడ్ బుక్ లో పేర్లు రాసి పెట్టి ఉన్న వారికే ఇబ్బందులు వస్తున్నాయని వారిని వేధిస్తున్నారని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని వైసీపీ నేతలు విమర్శలు కూడా చేస్తున్నారు.

దానికి ధీటుగా వైసీపీ కూడా బుక్ రాస్తుందని తాము అధికారంలోకి వస్తే వారి సంగతి తేలుస్తామని హెచ్చరిస్తోంది. ఇలా టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య బుక్ పాలిటిక్స్ సాగుతూంటే పవన్ కళ్యాణ్ ఒక డైరీని పెట్టుకుని పేర్లు రాస్తున్నారు అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే పవన్ రాస్తున్నది ఎవరినో శిక్షించడానికి కాదు, తన పార్టీ వారికి న్యాయం చేయడానికి అని అంటున్నారు.

జనసేన 2014 మార్చి 14న పుట్టింది. ఇప్పటికి సరిగ్గా పుష్కర కాలం అయింది. మరి నాటి నుంచి నేటి దాకా పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. పవన్ కోసం తన కాలాన్ని కష్టాన్ని జీవితాన్ని రాసి ఇచ్చేసిన వారు ఉన్నారు. అలా చూస్తే ప్రతీ నియోజకవర్గంలో కరడు కట్టిన నాయకులు చాలా మంది కనిపిస్తారు. 

వీరంతా పవన్ ని మంచి పొజిషన్ లో చూసుకుంటే చాలని నిస్వార్ధంగా పార్టీ జెండా ఎత్తిన వారే. అయితే అటువంటి వారికి సముచితమైన గౌరవాన్ని పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఇవ్వాలని పవన్ ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. పార్టీ అధికారంలో కీలక భాగస్వామిగా ఉంది. ఏడాది పైగా సమయం గడచింది.

అయినా ఇంకా నాలుగేళ్ళ కాలం ఉంది. ఈ కీలక సమయంలో పార్టీ కోసం పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పార్టీలో మిగిలిన వారికి అది స్పూర్తి దాయకంగా ఉంటుందని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పునాదుల నుంచి ఉంటూ కష్టించి పనిచేస్తున్న నాయకుల పేర్లను పవన్ ప్రత్యేకంగా డైరీలో రాస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వారి వివరాలను కూడా ఆయన తెప్పించుకుంటున్నారని అంటున్నారని చెబుతున్నారు.

ఇలా నేతల జాబితాను సిద్ధం చేసుకుని వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఏ పార్టీకి అయినా క్యాడర్ చాలా కీలకం. అలాగే పార్టీ కోసం పనిచేసే నేతలు అవసరం. చావో రేవో పార్టీతోనే అన్న వారి మరీ ముఖ్యం. అలాంటి వారు ఉంటే పార్టీ గెలుపు ఓటములకు అతీతంగా రాణిస్తుంది. 

అందుకే పవన్ కళ్యాణ్ కష్టపడే వారి జాబితాను రెడీ చేస్తున్నారని అంటున్నారు. పవన్ డైరీలో పేరు ఉంటే చాలు వారికి పదవి తలుపు కొట్టుకుంటూ ఇంట్లోకి వచ్చినట్లే అని అంటున్నారు. మొత్తానికి జనసేనను 2029 ఎన్నికల నాటికి పటిష్టం చేయాలన్న ఉద్దేశ్యంతో పవన్ పోటీ చేసిన 21 సీట్లతో పాటుగా మిగిలిన చోట్ల కూడా సీనియర్ నేతలకు పార్టీకి అంకితం అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి జనసేనలో ఇది కీలకమైన పరిణామంగా చెబుతున్నారు.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi