కిరోసిన్ పోసుకొని ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మున్సిపల్ మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరుణాకర్‌గా గుర్తింపు
తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆందోళన
ANDHRAPRADESH:నల్గొండలోని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా, స్థానికులు అతడిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మున్సిపల్ మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరుణాకర్‌గా గుర్తించారు. మంత్రి అనుచరుల ఒత్తిడితో తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని బాధితుడు ఆరోపించాడు. ఉద్యోగం లేకపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Shakir Babji Shaik
Editor | Amaravathi