ANDHRAPRADESH:మహిళలు RTC బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదని పేర్కొన్నారు. కాకినాడ(D) అన్నవరంలో 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ తో చర్చించినట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. మహిళలు RTC బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. అంతేకాక ఆటో డ్రైవర్లకు ఆగస్టు 15న ఆర్థిక సాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆగస్టు 2, 3వ తేదీల్లో అన్నదాత సుఖీభవ సొమ్ము జమ చేస్తామన్నారు. అర్హులైన వితంతువులకు ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. అయితే జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని గతంలో సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే తాజాగా మహిళలు RTC బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. పెరిగే రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నట్లు సమాచారం.