Hot Posts

6/recent/ticker-posts

మన హీరో సినిమాను కాపాడండి ప్లీజ్'.. జనసేన మంత్రి సంచలన ఆడియో లీక


ANDHRAPRADESH:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. జులై 24న విడుదలైన ఈ మూవీ తొలిరోజు మార్నింగ్ షో నుంచే నెగెటివ్ టాక్ తో బోల్తా కొట్టింది. ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్ పెద్ద దెబ్బ తీశాయని, ఏమాత్రం బాగోలేని గ్రాఫిక్స్‌ చూపించారని చూసిన ఆడియెన్స్, నెటిజన్స్ సామాజిక మాధ్యమాల్లో ట్వీట్స్ చేస్తున్నారు. సినిమాటోగ్రపీ, టేకింగ్ నీరసం తెప్పించాయని విమర్శలు వచ్చాయి. అయితే సినిమాకు సంబంధించిన ఓ ఆడియో లీకై సంచలనంగా మారింది

డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనండి.. దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి.. అని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకు, జన సైనికులను విజ్ఞప్తి చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలన్నారు.


ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర వీరమల్లు సినిమా చూడాలి.. మీరు డబ్బులు పెట్టి ఇతరులకు సినిమా చూపించాలి. హరిహర వీరమల్లు సినిమాను హిట్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు పవన్ ఆదేశాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్. ఇప్పటికే మూడు సార్లు జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వారం రోజుల పాటు ఈ సినిమాను సపోర్ట్‌ చేయాలి. సినిమా టాక్ నెగటివ్‌గా ఉంది దాన్ని మార్చాలి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలి. మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరు చూసేలా చేయాలి. హరిహర వీరమల్లు ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది.. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలి. ఎక్కువ సార్లు హరిహర వీరమల్లు సినిమా చూడండి.. విజయవంతంగా నడిచేలా చూడండి. డబ్బులు లేనివాళ్లకు డబ్బులు ఇచ్చి చూపించండి. ప్రతీ థియేటర్‌కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయండి.అందరిని సినిమాకు తీసుకొచ్చే బాధ్యత మీదే అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ ఆడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.