ANDHRAPRADESH:ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. కూటమి కి కౌంటర్ గా జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని జగన్ చెబుతున్నారు. జగన్ పరామర్శల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పర్యటనల పైన ఆంక్షలు విధిస్తున్నారు. కాగా, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన వేళ ఆసక్తి కర నిర్ణయాలు జరుగుతున్నాయి. మరి, జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శల యాత్రలు వివాదాస్పదం అవుతున్నాయి. పల్నాడు పర్య టన వేళ చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. అనుమతి ఇవ్వటం పైన ఆచి తూచి స్పందిస్తోంది. జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాల్యం లో మామిడి రైతుల ను పరామర్శించేందుకు వస్తున్నారని.. పది వేల మందికి అనుమతి ఇవ్వాలని వైసీపీ నేతలు జిల్లా పోలీసు అధికారులను కోరారు. దీంతో, బంగారుపాళ్యం మండలం మొగిలి వెంకటగిరి సమీపంలో తగ్గువారిపల్లి దగ్గర జగన్ హెలిప్యాడ్‌కు పోలీసులు నుంచి అనుమతి లభించింది. ఇదే సమయంలో జన సమీకరణ పైన పోలీసుల అనుమతి కోరగా.. పోలీసులు షరతులతో వైసీపీ నేతల వినతుల పైన స్పందించారు.
గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ పర్యటనల పైన పోలీసులు ఆంక్షలు విధిస్తు న్నారు. నెల్లూరు పర్యటనలోనూ హెలికాఫ్టర్ అనుమతి సమస్యతో జగన్ పర్యటన వాయిదా వేసుకు న్నారు. హెలికాప్టర్ అనుమతి కోసం వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కాగా, మామిడి రైతులను పరామర్శ వేళ మార్కెట్ యార్డులో ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకుని కొద్దిమందినే అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు వైసీపీ నేతలకు స్పష్టత ఇచ్చారు. జగన్ ను అనుమతి ఇచ్చిన హెలిపాడ్ వద్దకు 30 మందికే అనుమతి ఇవ్వగా.. మార్కెట్ యార్డు వద్ద పరామర్శ వేళ 500 మందికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదే విధంగా జగన్ పర్యటన సమయంలో ఎలాంటి ర్యాలీలు.. రోడ్ షో లు చేయవద్దని పోలీసు అధికారులు స్పష్టం చేసారు. ఈ మధ్నాహ్నం జగన్ బెంగళూరు నుంచి ఇడుపులపాయ కు చేరు కొని .. రేపు (మంగళవారం) వైఎస్సార్ జయంతి వేళ నివాళి అర్పిస్తారు. అటు నుంచి పులివెందుల వెళ్తారు. పార్టీ నేతలు... స్థానికులతో సమావేశం అవుతారు. ఆ తరువాత జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. తిరిగి 9వ తేదీ బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, మొగబాగిలు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్ల బైపాస్, పలమనేరు మీదుగా బంగారు పాలెంకు చేరుకుంటారు. ఇక, ఇప్పుడు పోలీసుల ఆంక్షలు.. షరుతల వేళ.. జగన్ పర్యటన ఏ విధంగా సాగుతుందీ అనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi