ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
శ్రావణ పౌర్ణమి నాడు తమిళనాడులోని ప్రఖ్యాత శైవక్షేత్రం అరుణాచలాన్ని సందర్శించే భక్తుల కోసం తాజాగా నర్సాపూర్ నుంచి తిరువణ్ణామలైకి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇది వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్. ఈ నెల 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ఈ నెల 9, 16, 23, ఆగస్టు 6, 13, 20, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో ప్రతి బుధవారం..నర్సాపూర్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరే నంబర్ 07219 ప్రత్యేక రైలు.. మరుసటి రోజు తెల్లవారు జామున 4:55 నిమిషాలకు తిరువణ్ణామలైకి చేరుకుంటుంది.
ఈ నెల 10, 17, 24, జులై 7, 14, 21, ఆగస్టు 5, సెప్టెంబర్ 25 తేదీల్లో ప్రతి గురువారం తిరువణ్ణామలై నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరే నంబర్ 07220 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ కు రిజర్వేషన్ ఈ ఉదయం నుంచి ఆరంభమైంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi