HYDERABAD:సృష్టి టెస్ట్ ట్యూబీ సెంటర్ కేసులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు, ఆకృత్యాలు పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. దర్యాప్తులో భాగంగా సృష్టి క్లినిక్ నుంచి ఐవీఎఫ్, సరోగసీ కేసుల రికార్డులను స్వాధీనం చేసుకున్న నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు.. ఈ మేరకు కీలక విషయాలను గుర్తించారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ లపై ఉండే బిచ్చగాళ్ల నుంచి వీర్యం సేకరించినట్టుగా తెలుస్తోంది. బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ పెట్టి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లుగా తేలినట్లు సమాచారం. దాంతోపాటు సరోగసీ పేరుతో పేదల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని, సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో మరింత లోతుగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సృష్టి టెస్ట్ ట్యూబీ సెంటర్ కేసులో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరోగసీ పేరుతో పేద ప్రజల నుంచి శిశువులను తక్కువ ధరకు కొని, సంతానం లేని వారికి లక్షల్లో విక్రయించినట్లు గోపాలపురం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో తేలింది. అంతేకాక సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ లపై ఉండే బిచ్చగాళ్ల నుంచి వీర్యం సేకరించినట్టుగా తెలుస్తోంది. బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ పెట్టి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లుగా తేలినట్లు సమాచారం అందుతోంది. ఈ దారుణాల నేపథ్యంలో సృష్టి సెంటర్ ద్వారా పిల్లలు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎవరి పిల్లలను ఇచ్చారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అటు ఏపీలోనూ విజయవాడ, వైజాగ్ లో బ్రాంచీలు ఉన్నట్లు సమాచారం. అంతేకాక ఒడిశా, కోల్ కతాలోనూ బ్రాంచీలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ లో పోలీసులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. క్లూస్ టీమ్ సాయంతో గోపాలపురం పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. పలువురి నుంచి సేకరించిన వీర్యకణాలకు సంబంధించిన మూడు డబ్బాలు, ఆధార్ కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని పంకజ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
🔥సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉండే బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరణ.
— VENKATESH RODBENDERS (@venkkateshrodbe) July 29, 2025
సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో IVF సరోగసీ రికార్డులు సీజ్.
కమిషన్ ఆశ చూపి.. కూలీల వీర్యం తీసుకుని వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్న గ్యాంగ్!😜 pic.twitter.com/iGc510uO3J







