దీనిపై ఇవాళ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేవలం రూ.3200 కోట్ల విలువైనది మాత్రమే కాదని, 30 వేల మంది ప్రాణాలకు సంబంధించిన వ్యవహారమంటూ ఆయన ఆరోపించారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందని ఆయన తెలిపారు. మోడీ పహల్గాం తీవ్రవాదులపై తీసుకున్న చర్యలు చూశామని, ఇప్పుుడు ఆర్థిక ఉగ్రవాదులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై చర్యలు తీసుకుంటారని, కానీ లిక్కర్ స్కాం లో చాలా మంది పేదల ప్రాణాలు పోయినా స్పందించడం లేదని సోమిరెడ్డి విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసు,కాళేశ్వరం పై ఈడీ విచారణ చేపడుతోందని, అలాగే ఈడి ఏపీ లో జరిగిన భారీ లిక్కర్ స్కాం పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 3200కోట్లే మద్యం స్కాం కాదు ఇది, 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న ఏపీ మద్యం స్కాం పై విచారణ జరగాలన్నారు.
ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని సోమిరెడ్డి విమర్శించారు. ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడల్ ఇవ్వాలన్నారు. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నాను అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే అది ఫేక్ అని తెలియక ఈడీ వెంటనే స్పందించిందని వ్యంగాస్తాలు సంధించారు. అలాగే ఏపీ మద్యం స్కాం పై కూడా విచారణ చేయాలన్నారు. తద్వారా ఇంత పెద్ద మద్యం స్కాంపై ఈడీ నిర్లక్ష్యంగా ఉండటమేంటని ప్రశ్నించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi