Hot Posts

6/recent/ticker-posts

పవన్ బిగ్ డెసిషన్, సర్వే రిపోర్ట్స్ తో అలర్ట్ - కీలక మలుపు..!!

ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజుల తరువాత పార్టీ పైన పవన్ ఫోకస్ చేసారు. ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచిన తరువాత పార్టీ ప్లీనరీ మినహా కీలక సమావేశాలు జరగలేదు. ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తి కావటంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. పరిస్థితి అర్దం చేసుకున్నారు. దీంతో, ఒక నిర్ణయానికి పవన్ వచ్చారు. అందులో భాగంగా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు కూటమి లో కీలక మలుపుగా మారనుంది.

పవన్ నిర్ణయంతో 

డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా 21 సీట్లకే జనసేన పరిమితం అయింది. పోటీ చేసిన రెండు ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీ విజయం సాధించింది. పవన్ తో సహా మరో ఇద్దరు మంత్రులు అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 13 నెలలు పూర్తయింది. మరి కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది. అటు బీజేపీ ఏపీ కేంద్రంగా తమ బలం పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. టీడీపీ ఇప్పటికే ఏడాది పాలన లో తమ సక్సెస్ వివరిస్తూ తొలి అడుగు పేరుతో తమ పార్టీ నేతల ను ప్రతీ ఇంటికి పంపిస్తోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన దూరంగా ఉంటున్నాయి. మరో 15 ఏళ్లు కూటమి కొనసాగుతుందని చెబుతున్న పవన్ ఇప్పుడు ఆసక్తి కర అడుగులు వేస్తున్నారు.

ఇంటింటికీ జనసేన 

పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకొని.. ఇక పూర్తిగా పార్టీ కోసమే సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఎన్నికలు పూర్తయిన తరువాత పవన్ పార్టీ కోసం అంతగా సమ యం కేటాయించలేదు. క్షేత్ర స్థాయిలో ఏడాది పాలన.. తన పార్టీ ఎమ్మెల్యేల పని తీరు.. ప్రజా భిప్రాయం పైన పవన్ సర్వే నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కూటమి పార్టీల సమన్వయం పైన ఆరా తీసారు. వీటిని పరిగణలోకి తీసుకున్న పవన్ ఇక ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించాలని పవన్ డిసైడ్ అయ్యారు. కూటమిలో కొనసాగుతూనే తమ పార్టీ బలం పెంచుకోవటం పైన వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

భవిష్యత్ లెక్కలు

రాజకీయంగా భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా.. తన బలం నిరూపించుకునే విధంగా పవన్ ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో సర్వే చేయించిన పవన్.. వాటిల్లో 45 స్థానాల్లో బలం ఉన్నట్లు గా గుర్తించినట్లు సమాచారం. దీంతో, త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకంతో పాటు గా క్షేత్ర స్థాయిలో మరింత బలం పెంచుకునేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇక, జనసేన ప్రతీ ఇంటికి వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇప్పుడు కూటమిలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi