Hot Posts

6/recent/ticker-posts

వైసీపీకి జగన్ ఏరి కోరి తెచ్చుకున్న నేత గుడ్ బై..!?


ANDHRAPRADESH:ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహా లను అమలు చేస్తున్నాయి. వైసీపీ కూటమి ప్రభుత్వం పై కౌంటర్ గా కార్యాచరణ అమలు చేస్తోం ది. ఎన్నికలు జరిగిన తరవాత 13 నెలలకే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. వైసీపీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో... వెళ్లిన నేతలు కొందరు తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, తాజా గా మరో కీలక నేత పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది

నెల్లూరు జిల్లా కేంద్రంగా వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి తొలి నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు గెలవలేదు. కాగా, నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల ముందు ఆనం, కోటంరెడ్డి, వేమిరెడ్డి వంటి ముఖ్య నేతలు పార్టీ వీడారు. ఇప్పుడు ఆ ముగ్గురు టీడీపీ నుంచి గెలుపొందారు. ఇక.. ఇప్పుడు మాజీ ఎంపీ.. నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడేందుకు సిద్దమైనట్లు జిల్లాలో ప్రచారం సాగు తోంది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన వైసీపీలో చేరారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

2024 ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని భావించినా.. ఎంపీగా సాయిరెడ్డిని పోటీకి దిగారు. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయా లని జగన్ సూచన మేరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కోటంరెడ్డి విజయం తరువాత ఆదాల రాజ యంగా క్రియాశీలకంగా లేరు. జిల్లా వైసీపీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు.. కేసులు.. వివాదాలు.. జిల్లా నేతల మధ్య కొరవడిన సమన్వయం తో ఆదాల మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో, ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీకి సిద్దంగా లేరని తెలుస్తోంది. రాజకీయాల నుంచి విరిమించుకోవాలని ఆదాల భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆదాలతో వైసీపీలోని ముఖ్య నేత తాజాగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఆదాల నిర్ణయం ఏంటనేది జిల్లా వైసీపీలో ఆసక్తి కరంగా మారుతోంది.