ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఆలమూరు మండలం పినపల్ల గ్రామంలో వెటర్నరీ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఈదల శ్రీనివాస్ చౌదరి నిన్న అనారోగ్యంతో మృతి చెందారు..
ఈ మేరకు బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆలమూరు గ్రామంలో ఆయన స్వగృహం వద్ద ఆయన కుటుంబ సభ్యులను జగ్గిరెడ్డి పరామర్శించి ఓదార్చారు.. ముందుగా శ్రీనివాస్ చౌదరి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్, కొత్తపేట నియోజకవర్గ పంచాయతీ రాజ్ అధ్యక్షులు పాల నాగేశ్వరరావు, కొత్తపేట నియోజకవర్గ బూత్ కమిటీ విభాగ అధ్యక్షులు నామాల శ్రీనివాస్, జొన్నాడ ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, ఆలమూరు సర్పంచ్ నాతి కుమార్ రాజా, ఆలమూరు గ్రామ అధ్యక్షులు రావాడ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema