ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ పరిధిలో NH 216 రోడ్డుపై అవంతి సీ ఫుడ్ ఎదురుగా గల రోడ్డుపై జరిగిన ప్రమాదంలో దుర్మరణం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం గంటి చిన్న పేటకు చెందిన ఎడ్ల సుభాష్(24) అనే యువకుడు తన మోటార్ సైకిల్ AP 05 CR 8543 గ్లామర్ మోటార్ సైకిల్ పై గోపాలపురం వెళుతుండగా అదే సమయంలో వెనుకవైపును వస్తున్న లారీ AP 07 TH 1459 లారీ డ్రైవర్ తన లారీని అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వేగంగా నడిపి ముందు వెళుతున్న మోటార్ సైకిను గుద్దినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే చనిపోయినట్లు మృతిని చిన్నాన్నైనా ఎడ్ల రాజు ఇచ్చిన రిపోర్టుపై రావులపాలెం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లుగా రావులపాలెం టౌన్ సీఐ ఎం శేఖర్ బాబు తెలిపారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema