Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం.. చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!

 

ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో పని చేసే ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం శుభవార్త చెప్పబోతోంది. ఉద్యోగం చేసే మహిళలు పిల్లల అలనా పాలనా చూసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని భావించిన చంద్రబాబు సర్కార్ మహిళలకు ఇకపై ఆ ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేయబోతోంది.

మహిళలకు శుభవార్త చెప్పనున్న చంద్రబాబు సర్కార్

మహిళలు ఇటు జాబ్ ను అటు పిల్లల అలనా పాలనను చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో, ఈ మెంటల్ స్ట్రెస్ నుండి మహిళలకు విముక్తి కల్పించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ పని ప్రదేశాలలో క్రెష్ లను, చిన్నారుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసి వారికి ఆ ఇబ్బంది నుండి విముక్తి కల్పించాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

216 ప్రాంతాలలో క్రెష్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

రాష్ట్రవ్యాప్తంగా 216 ప్రాంతాలను గుర్తించి అక్కడ క్రెష్ లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించి కేంద్ర సహకారం కోసం ప్రతిపాదనలను పంపించింది. మహిళా ఉద్యోగులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో క్రెష్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రభుత్వ భవనాలలోనే నిర్వహణకు ఏర్పాట్లు

వంద మంది కంటే ఎక్కువ ఆడవారు పని చేసే చోట క్రెష్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాల వద్ద వీటిని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించింది. సాధ్యమైనంతవరకు ప్రభుత్వ భవనాలలోనే వీటిని నిర్వహించటానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మహిళా ఉద్యోగులకు చంద్రబాబు హామీ

ఏపీ సీఎం చంద్రబాబు కొంతకాలం క్రితం మహిళా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కుటుంబ జీవితాన్ని, ఇటు ఉద్యోగ జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని, పిల్లల్ని పెంచే బాధ్యత మహిళల పైనే ఉంటుంది కాబట్టి, వారి విషయంలో మహిళలకు ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని వారి కష్టాలను తొలగించడం కోసం పని ప్రదేశాలలో క్రెష్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అమరావతిలో నిర్వహిస్తున్న క్రెష్

ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వీటిని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి సచివాలయంలో ఒక క్రెష్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆరు నెలలు పైబడిన పిల్లలను చూసుకుంటారు. పిల్లల సంరక్షణ కోసం ఒక కార్యకర్త, ఒక సహాయకురాలు ఉంటారు. అన్ని వసతులు అక్కడ ఉంటాయి. 

మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం

ఇక తల్లిదండ్రులు తెచ్చి ఇచ్చిన ఆహారాన్ని అక్కడ పిల్లలకు తినిపిస్తారు. సాయంత్రం ఉద్యోగం అయిపోయిన తర్వాత తల్లులు తమ పిల్లల్ని తీసుకుని ఇళ్లకు వెళ్తారు. ఇదే విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతిచోట క్రెష్ లు ఏర్పాటు చెయ్యాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు కేంద్ర సహాయాన్ని కోరుతుంది. ఇక ఈ నిర్ణయం పట్ల మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now