ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం విద్య సామగ్రిని పంపిణీ చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో:కొత్తపేట మండలం మోడెకుర్రు గ్రామంలో ఉన్నతమైన విద్య అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందుకుగాను విద్యకు సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు.ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తల్లులు ఖాతాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి నిధులు జమ చేశారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి పర్యటించారు
ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు
ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే సత్యానందరావు పాఠశాల వద్ద విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాం షూస్ బ్యాగ్ తదితర విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన విద్యా సామాగ్రిని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మోడేకూరు పాఠశాలలో పనిచేస్తున్న సుతాపల్లి కొప్పేశ్వరరావు పాఠశాల ప్రాంగణంలో తన సొంత నిధులతో నిర్మిస్తున్న స్టేజి ని పరిశీలించారు.
ఉపాధ్యాయుడిని అభినందించి సాలువ కప్పి చిరు సత్కారం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇదేనని ఇదే తరహాలో ఉన్నతంగా ఉన్నవారు పేద పిల్లలను దత్తత తీసుకునీ చదివించాలని కోరారు
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Vijaya Babu. I
Staff Report | Konaseema