Hot Posts

6/recent/ticker-posts

పేదలను గురి పెడుతూ కూటమి బ్రహ్మాస్త్రం

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల కోసం సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోంది.

ANDHRAPRADESH:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల కోసం సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. వస్తూనే సామాజిక పెన్షన్లు భారీగా పెంచింది. దాంతో లక్షలాది మందికి న్యాయం జరిగింది. ఇక మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఏడాదికి ఇవ్వడం ద్వారా మరో హామీని నిలబెట్టుకుంది. తాజాగా తల్లికి వందనం పధకం అమలు చేసింది. దాంతో పెద్ద ఎత్తున పేద మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం జరిగింది.

ఇపుడు అన్న దాత సుఖీభవ పధకానికి కూడా రంగం సిద్ధం చేసింది. ఇది లక్షలాది రైతాంగానికి న్యాయం చేయబోతోంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పధకాన్ని కూడా ఏపీలో అమలు చేస్తారు. ఈ విధంగా మహిళలను ఆకట్టుకోవడం జరుగుతుంది ఈ పధకాలు అన్నీ ఒక ఎత్తు అయితే పేదలు దిగువ మధ్యతరగతి వర్గాలకు లైఫ్ టైం అచీవ్ మెంట్ లాంటి పధకంగా దీనిని ముందుకు తెస్తున్నారు.

మిగిలిన పధకాలు అన్నీ తాత్కాలికం. అయితే ఈ పధకం శాశ్వతం. ఉండేందుకు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల్లో హామీని కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దీనిని సంబంధించిన ప్రక్రియను తాజాగా ప్రారంభించింది. 

ఈ నెల 19 నుంచి ఈ పధకానికి అర్హులైన లబ్దిదారుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఘట్టం మొదలైంది. ఈ పధకానికి అర్హులైన లబ్దిదారులు అ తమ ఆధార్ కార్డును అలాగే, రేషన్ కార్డును, ఒక పాస్‌పోర్టు సైజు ఫోటోను తీసుకుని వెళ్ళి సంబంధిత గ్రామ సచివాలయాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అలా దరఖాస్తులను ఆన్ లైన్ లో పూర్తి చేసి సచివాలయం ద్వారా అప్లోడ్ చేయించాల్సి ఉంటుంది.

ఈ పధకం కింద పట్టణాలలో అర్హులైన వారికి రెండు సెంట్ల స్థలం, పల్లెలలో మూడు సెంట్ల స్థలం ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. ఇక వైసీపీ హయాంలో చూస్తే గ్రామాలలో సెంటున్నార పట్టణాలలో సెంటు స్థలాన్నే ఇచ్చారు. అపుడు ఇళ్ళ స్థలాలు తీసుకున్న వారు ఎవరూ ఇళ్ళ నిర్మాణాలు చేపట్టలేదు. తమకు కూడా కూటమి ప్రభుత్వం పెంచిన ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని ఇవ్వాలని కోరుతున్నారు. 

దీంతో ఖాళీగా స్థలాలు ఉంచుకుని ఇళ్ళు నిర్మించని వారికి కూడా ప్రభుత్వం ఈ పధకం వర్తింపచేయాలని నిర్ణయించింది. ఇక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కావడంతో పేదలు మధ్యతరగతి వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులకు గడువు విధించి తొందరలోనే వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలను పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక 2014 నుంచి 2019 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన టిడ్కో ఇళ్ళని కూడా పూర్తి చేసి 2026 సంక్రాంతి నాటికి లబ్దిదారులకు పెద్ద ఎత్తున ఇవ్వాలని భావిస్తోంది అని అంటున్నారు. దీంతో ఏపీలో ఇళ్ళ పండుగకు కూటమి అన్ని విధాలుగా రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. ఈ పధకం సక్సెస్ తో నూరు శాతం పేదలు బడుగుల మద్దతు పొందవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది అంటున్నారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi