Hot Posts

6/recent/ticker-posts

మరో జగన్ ఆత్మీయుడికి లిక్కర్ కేసు ఉచ్చు, ఇక నెక్స్ట్..!!


ANDHRAPRADESH:ఏపీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సెట్ . .ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్దమైంది. ఇందులో ఏ 4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి సెట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనకు సుప్రీంలో ముందస్తు బెయిల్ దక్కకపోవటంతో... అరెస్ట్ ఖాయమని చెబుతున్నారు. కాగా, మరో జగన్ అత్మీయుడిగా.. గతంలో డిప్యూటీ సీఎం గా పని చేసిన నారాయణస్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో.. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.


జగన్ హయాంలో డిప్యూటీ సీఎం హోదాలో ఎక్సైజ్ శాఖ పర్యవేక్షించిన నారాయణ స్వామికి సిట్ నోటీసుల జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నిర్దేశించింది. లిక్కర్ స్కాంలో సంబంధిత మంత్రిగా నారాయణ స్వామిని విచారించనుంది. ఈ రోజు లిక్కర్ కేసులో కీలక పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. మిథున్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఛార్జ్ షీట్ లో సిట్ ఎవరి పేర్లు ప్రస్తావన చేస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది. కాగా, విచారణ వేళ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని.. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు..కేసులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.. భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండనని.. వీట న్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేసారు.

ఈ కేసుల నుంచి బయటపడతానని.. తన పాత్ర పై ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేసారు. తన ఫోన్ లు మీకు ఇస్తా..దర్యాప్తుకు సహకరిస్తానని వెల్లడించారు. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. రాజకీయ ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని..ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారని విమర్శిం చారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో... భయానో ఒప్పించి స్టేట్మెంట్లు తీసుకుంటు న్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్ గా కేసులు పెడుతు న్నారని మండిపడ్డారు. 2014-19 లోను తన పై తప్పుడు కేసులు పెట్టారని.. తానేదో దాడి చేశా నని నాడు టీడీపీ హయాంలో కేసు పెట్టారని...నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా జైల్లో పెట్టారు అప్పుడు తప్పుడు సాక్షాలు చెప్పిన వారంతా మళ్లీ కోర్టుకు వచ్చి అదంతా తప్పుడు సాక్ష్యం అని చెప్పారు దాంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు.