ANDHARAPRADESH,NELLURU:నెల్లూరు జిల్లా కోవూరులో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గత కొన్నేళ్లుగా కోవూరులో రాజకీయాల్ని శాసిస్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికీ, తాజాగా ఆయన స్ధానం ఆక్రమించిన మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికీ వార్ తారా స్థాయికి చేరుకుంది. అంగబలం, అర్ధబలం కలిగిన వారు కావడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు రోడ్డు రాజకీయాల వరకూ వెళ్లిపోయింది. నిన్న ప్రసన్న ఇంటిపై టీడీపీ నాయకులు దాడులు చేయగా.. ఇవాళ దానికి నిరసనగా వైసీపీ ఆందోళనలు చేపట్టింది. దీంతో టీడీపీ మహిళా నేతలతో పోటీ నిరసనలకు దిగింది.
కోవూరులో గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎంట్రీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నచ్చలేదు. దీంతో ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ప్రశాంతి రెడ్డి ఓసారి ఎన్నికల ప్రచార సభలోనే కంటతడి పెట్టుకున్నారు. ఆ జడిలో నల్లపురెడ్డి ఎన్నికల్లో కొట్టుకుపోయారు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంతిరెడ్డి నియోజకవర్గంలో తన స్ధానం సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాను పీహెచ్ డీ చేశానని, ప్రసన్న ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో మరోసారి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేశారు. ఆమె అన్నింట్లోనూ పీహెచ్‌డీ చేసిందంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి రెండో పెళ్లి చేసుకుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా నిన్న టీడీపీ వర్గాలు ప్రసన్న ఇంట్లో లేని సమయంలో దాడి చేసి విధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఇవాళ నిరసనలకు దిగారు.
అయితే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని ఇవాళ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. దాడుల సంస్కృతి తమది కాదన్నారు. ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చన్నారు.నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను.వైసీపీ నేతలు మీ ఇంట్లో మహిళలకు చూపించండని ప్రశాంతిరెడ్డి సవాల్ చేశారు. నల్లపురెడ్డివ్యాఖ్యలను జగన్ సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. అయితే ప్రసన్నను ముందుగా ప్రశాంతిరెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్లే ఆయన కౌంటర్

Shakir Babji Shaik
Editor | Amaravathi