Hot Posts

6/recent/ticker-posts

రేవంతన్న ముందు షర్మిల కీలక డిమాండ్..! జగన్ అడగలేనిది తానే..!


ANDHRAPRADESH:ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ తన పార్టీకే చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఓ కీలక డిమాండ్ పెట్టారు. తెలంగాణలో గతంలో రాజకీయం ప్రారంభించి అనంతరం ఏపీకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. అక్కడి సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో పోటీ లేకుండా చేశారు. ఆ తర్వాత నుంచి రేవంత్ తో రాజకీయంగా సన్నిహితంగా ఉంటున్న వైఎస్ షర్మిల ఇవాళ ఆయనకు కీలక విజ్ఞప్తి చేశారు.

దివంగత మాజీ సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు సీఎంగా పనిచేశారని, రాష్ట్రంలో నే కాదు దేశంలోనే అధికారంలో కాంగ్రెస్ అధికారంలో రావడంలో వైఎస్సార్ కీలకంగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు.పరిపాలన, పథకాలతో కోట్ల మందిని తాకారన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, జలయజ్ఞం లాంటి పథకాలు వైఎస్సార్ మార్క్ అన్నారు.

మాట తప్పక పోవడం , మడిమ తిప్పక పోవడం వైఎస్సార్ నైజమని షర్మిల తెలిపారు. వైఎస్సార్ చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారని, కాబట్టి వైఎస్సార్ అభిమానుల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మరణం తరువాత హైదరాబాద్ లో మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలిందని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో సోనియా కు,రాహుల్ కి హైదరాబాద్ లో వైఎస్ స్మారకం ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్లు తెలిపారు. వైస్సార్ జయంతులకు,వర్ధంతులకు నివాళులు అర్పించేందుకు మెమోరియల్ ఉండాలన్నారు. రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు వైఎస్ రాజకీయ వారసుడిగా ఉన్న వైఎస్ జగన్ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూస్తున్నారు. అంతే కాదు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ తోనూ జగన్ కు సత్సంబంధాలు లేవు. ఇలాంటి సమయంలో షర్మిల తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హైదరాబాద్ లో వైఎస్సార్ మెమోరియల్ పెట్టించగలిగితే అది ఆమెకు అన్నివిధాలా ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now