ANDHRAPRADESH:వాస్తవానికి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. జగన్‌హయాంలోని కొన్ని పధకాలను రద్దు చేశారు.
ఔను.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దిగిపోయి ఏడాది అయినా.. ఆయన జమానా తాలూకు తీసుకున్న నిర్ణ యాలు.. మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. మండల స్థాయి టీడీపీ నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు అంటున్న మాట. ''మేం ఏం చేయాలో అర్ధం కావడం లేదు. జగన్ పేరు వినిపించకుండా చేయాలని అనుకున్నాం. ప్రజలు కూడా జగన్‌ను కాదని మాకు అధికారం ఇచ్చారు. కానీ.. ఆయన జమానాలో ఉన్నవే ఇంకా కొనసాగుతున్నాయి.'' అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరుగుతోంది..?
వాస్తవానికి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. జగన్‌హయాంలోని కొన్ని పధకాలను రద్దు చేశారు. అదేవిధంగా జగన్ పేరు తుడిచి పెట్టుకుపోయేలా.. వలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు. సచివాలయాలను కూడా పక్కన పెట్టారు. దీనిని ఎవరూ కాదనరు. ఎవరి ప్రభుత్వం వారిది. ఎవరి నిర్ణయాలు వా రివి. ఈ క్రమంలోనే చెత్తపై పన్నులు రద్దు చేశారు. రహ దారుల నిర్మాణాలను కూడా చేపట్టారు. ఇలా.. భారీ ఎత్తున సంస్కరణలు తీసుకువచ్చి.. జగన్ పేరును వినిపించకుండా చేయాలని చూశారు.
గతంలో వైసీపీ కూడా ఇలానే అన్న క్యాంటీన్లు తీసేసి.. రాజధానిని ఆపేసి.. చంద్రబాబు పేరు తీసేయాల ని భావించింది. అంతేకాదు.. చంద్రబాబు హయాంలో చేపట్టిన అనేక పథకాలను కూడా నిలుపుదల చేశారు. కానీ.. ఇప్పుడు అలా చేయలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉదాహరణకు విద్యుత్ బిల్లులు, స్మార్టు మీటర్ల వ్యవహారంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు.. ఆనాడు చేసుకున్న ఒప్పందాలనే కూటమి సర్కారు కొనసాగిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇక, భూముల సర్వేను గతంలో తప్పుబట్టిన కూటమి నాయకులు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను వచ్చీరా గానే రద్దు చేశౄరు. ఇది మంచిదే. కానీ.. ఏడాది తిరగకుండానే.. మరో రూపంలో దీనిని అమలు చేస్తున్నా రు. దీనిపై గ్రామీణ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయాలు ప్రజల్లో తీవ్ర చర్చకు కూడా దారితీస్తున్నాయి. జగన్ దిగిపోయినా.. జమానా మాత్రం కొనసాగుతోందన్న చర్చ రైతులు, కూలీలు సహా సాధారణ పౌరుల్లో వినిపిస్తోంది. ఇది పెరిగితే.. తర్వాత ఎంత మంచి చేసినా.. అది ప్రయోజనం ఇవ్వబోదని అంటున్నారు పరిశీలకులు.

Shakir Babji Shaik
Editor | Amaravathi