Hot Posts

6/recent/ticker-posts

అన్నదాత సుఖీభవ కోసం ఇదే లాస్ట్ ఛాన్స్..! మెసేజ్ వచ్చిందా ?


ANDHRPRADESH:ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఆగస్టు 2 నుంచి రైతుల ఖాతాల్లో డబ్పులు జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సమాచారం సేకరించిన అధికారులు ఈ-కేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ ఆధారంగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు జాబితాలు సిద్దం చేసారు. అయితే ఇదే పథకంలో భాగంగా ఇంకా ఈ రెండు పనులు పూర్తి కాని వారికి మాత్రం చివరి అవకాశం ఇచ్చారు.

అన్నదాత సుఖీభవ పధకానికి సంబంధించి ఇప్పటికే ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ చేయించుకున్న వారిని అర్హుల జాబితాలో ఉంచిన అధికారులు.. వీటిలో ఏ ఒక్కటి కాకపోయినా వారికి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఇవాళ్టి నుంచి ఇలా ఈ-కేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ రెండు కానీ, ఈ రెండింటిలో ఒకటి కాని పూర్తి కాని 68 వేల లబ్దిదారులకు మెసేజ్ లు పంపి అలర్ట్ చేయాలని నిర్ణయించారు. నిన్న సీఎస్ విజయానంద్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

ఇంకా ఈ-కేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ కాని వారు, పెండింగ్ లో ఉన్న వారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వీటిని పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులు సమయం ఉన్నందున దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో ఈ-కేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ కాని రైతులందరూ వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటూ ఇవాళ్టి నుచి ఆర్టీజీఎస్ ద్వారా మెసేజ్ లు పంపుతున్నారు.

చివరిగా అన్నధాత సుఖీభవ పధకానికి అనర్హులుగా గుర్తించి ఎవరినైనా తిరస్కరిస్తే అందుకు గల కారణాల్ని సైతం వారికి వివరించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఈ విషయం స్పష్టంగా తెలియజేయాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు అన్నదాత సుఖీభవకు అనర్హులుగా తేల్చిన వారి వివరాలు ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకూ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులుగా ఎవరినైనా గుర్తిస్తే వారిని లిస్ట్ లో చేర్చే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. రేపు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇవ్వనున్నారు.