ANDHRAPRADESH:డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో : ఆలమూరు మండలం ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించవలసిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు,ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు అన్నారు.
జేఈఈ అడ్వాన్స్ పోటీ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించి ముంబై ఐఐటి యూనివర్సిటీలో సీటు సాధించిన ఆలమూరు మండలం సంధిపూడి గ్రామానికి చెందిన తోట వెంకట రాజు ను ఆలమూరులో శనివారం మండల కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఇటువంటి ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తే వీరు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఎంతో మేలు చేస్తారని పలువురు కొనియాడారు. కాపు సంఘం ఆధ్వర్యంలో సత్కరించి కాపు సంఘం నాయకులు రూ.32,000లు నగదును ప్రోత్సాహంగా వెంకటరాజుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలమూరు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు రామానుజుల శేషగిరిరావు,అధ్యక్షుడు చల్లా నానాజీ,సెక్రటరీ ఎలుగుబంటి సాయిబాబు,జాయింట్ సెక్రటరీ శిరిగినీడి పట్టాభి,నాయకులు చల్లా లక్ష్మిభూషణం,చిన్నం హరిబాబు, అడప శ్రీనివాస్, చల్లా వెంకటేశ్వరరావు, డిపి.
రావు, చల్లా ప్రభ, సామంతుల నాని, గంధం మురళి, వెంపల సత్తిబాబు, శ్రీపతి సూర్యనారాయణ, శ్రీపతి వీర్రాజు, గంటా వీర్రాజు,జిన్నా ధనభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.