Hot Posts

6/recent/ticker-posts

సహకార సంఘాల ద్వారా రైతులకు మేలైన సేవలు అందించాలి*


ANDHRAPRADESH:డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: ఆలమూరు లో సహకార సంఘాల ద్వారా రైతులకు మేలైన సేవలందించే విధముగా పనిచేయాలని ఆలమూరు పిఎసిఎస్ త్రిసభ్య కమిటీకి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు. 

ఆలమూరు పిఎసీఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్గా వంటిపల్లి సతీష్ కుమార్, సభ్యులుగా సూర్య ప్రకాష్ నాగ వెంకట్రావు నియమితులైన సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం బండారు శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. వారిని కమిటీ చైర్మన్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సత్కరించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన ఏర్పాట్లను చేయాలని సూచించి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈవో బొబ్బా సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ నాయకులు బైరిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.