Hot Posts

6/recent/ticker-posts

అక్కడ భారీ వర్షాలతో.. గంట గంటకూ ఉప్పొంగుతున్న గోదావరి.. ప్రమద హెచ్చరికలు జారీ..!


ANDHRAPRADESH:గత వారం రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంతో గోదావరి నది గంట గంటకూ ఉప్పొంగుతోంది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. అటు ప్రాణహిత నది సైతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. జులై 11 వ తేదీ ఉదయానికి గోదావరి నీటిమట్టం 33.5 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలే లేవు. కానీ కృష్ణ, గోదావరి, ప్రాణహిత నదులు మాత్రం ఉప్పొంగుతున్నాయి. కారణం ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది గంట గంటకూ నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. గోదావరి నది ప్రస్తుత నీటి మట్టం 33.5 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

భద్రాచలంలో అధికారులు అలెర్ట్ ప్రకటించారు. భక్తులు గోదావరిలో స్నానం చేసేందుకు లోతుకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ మేరకు డేంజర్ బోర్డులను ఏర్పాటు చేశారు. గోదావరి ప్రవాహం పెరిగితే భద్రాచలం నగరాన్ని వరద నీరు ముంచెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు స్లూయిజ్ ల వద్ద ఇసుక బస్తాలను ఏర్పాటు చేసుకున్నారు. గంట గంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

గత వారం రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రాణహిత, గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తూ కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుండటంతో త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi