HYDERABAD:హైదరాబాద్ జీఎంసీ బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభం అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందీ భాష గొప్పదనాన్ని, దాని ప్రాముఖ్యతను వివరించారు. హిందీని నేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ అన్నారు.
హిందీ భాష ప్రాముఖ్యతను వివరించే క్రమంలో ఖుషీ సినిమా గురించి ప్రస్తావించారు పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఆ సినిమాలో ఏ మేరా జహా.. అనే పాటకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియజేశారు. అప్పట్లోనే హిందీ భాష, హిందీ పాటలపై తనకు ఎంతగానో మమకారం ఉండేదని అన్నారు.
జనగణమన అనే ఒక బెంగాలీ గీతం జాతీయ గీతం అయ్యిందని, పంజాబీ అయిన భగత్ సింగ్ దేశం కోసం పోరాడే విప్లవకారుడు అయ్యాడని గుర్తు చేశారు. అలాగే- రాజస్థాన్ కు చెందిన మహారాణ ప్రతాప్ శౌర్యపరాక్రమాలకు చిహ్నంగా మారాడని చెప్పారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడని వివరించారు.
మద్రాస్ ప్రెసిడెన్సీ, ద్రవిడ ప్రాంతంలోనున్న ఒకరు చేసిన మువ్వన్నెల జెండా దేశానికి తిరంగా అయిందని పేర్కొన్నారు. ప్రతీ భాషా జీవ భాషేనని, మాతృ భాషగానే పరిగణించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇన్ని భాషలు, సంసృతులు ఉన్న మన దేశానికి రాజ్య భాష హిందీ వెలుగొందుతోందని అన్నారు.
మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృ భాష ఉందని, ఇంటి సరిహద్దులు దాటితే రాజ్య భాష హిందీ ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు, దారులను వెదుక్కుంటూ ఉంటే.. మన దేశం మొత్తం ఈ రోజు ఏకం కావడానికి ఒక రాజ్య భాషని వెతుక్కుంటోందని, అది హిందీ అయిందని పేర్కొన్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, దేశంలోని ఇతరత్రా అన్ని భాషలు కావొచ్చు.. మన మాతృ భాష మీద మనకి గౌరవం ఉంటుందని, మన మాతృ భాష అమ్మ అయితే మన పెద్దమ్మ భాష హిందీగా అభివర్ణించారు పవన్ కల్యాణ్. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి అవకాశాల కోసం అన్ని భాషలు, మాండలికాలు అవధులను చేయించుకుంటూ వెళ్లిపోతున్నాయని చెప్పారు.
ఇలాంటి సమయంలో హిందీ ఒద్దు అనుకోవడం, దీన్ని వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు అవుతుందని చెప్పారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదు, మనం మరింత బలపడటమని, ఇంకొక భాషని అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చెయ్యడమని చెప్పారు.
ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలిగామని, అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదని అన్నారు.
సౌత్ ఇండియన్ సినిమాలలో 31 శాతం సినిమాలు హిందీలో డబ్ అయ్యి ఆదాయం వస్తుందని, వ్యాపారాలు చేయడానికి, ఆదాయాలను పెంచుకోవడానికి హిందీ కావాలి గానీ.. దాన్ని నేర్చుకోడానికి మాత్రం హిందీతో వచ్చిన ఇబ్బందం ఏంటి అని పవన్ చెప్పారు. హిందీతో రాజకీయాలు చేస్తున్నారని, హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకు?, హిందీని ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దామని అన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi