Hot Posts

6/recent/ticker-posts

ఈ ట్రంప్ ఏంటి ఇలా అడ్డం తిరిగాడు- భారత ఆయిల్ కంపెనీలకు వాత


INDIAN:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త టారిఫ్‌లు దేశ వాణిజ్యం రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రత్యేకించి కాపర్, ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై ఈ టారిఫ్‌ భారత్‌ కు పెను సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ పై విధించాల్సిన టారిఫ్ ను దాదాపుగా ఫైనల్ చేస్తోంది అమెరికా. దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారత్‌ పై 25 శాతం టారిఫ్ విధించినట్లు వెల్లడించారు. దీనిపై తమ రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, తుది దశకు చేరుకున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్‌తో నూతన చమురు వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి భారత్ ముడిచమురును కొనుగోలు చేసేలా తయారు చేస్తామని, ఎగుమతులకు మార్గం సుగమం అవుతుందని అన్నారు.

పాకిస్తాన్ తో ఆయిల్ ట్రేడ్ డీలింగ్స్ ను నడిపించడానికి ప్రత్యేకంగా ఓ సంస్థను ఎంపిక చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ ను విధించిన కొన్ని గంటలకే- పాకిస్తాన్‌లోని చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో ఒక కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ఇది భవిష్యత్తులో భారత్ కు పాకిస్తాన్ చమురు ఎగుమతి చేయడానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆయిల్ ట్రేడ్ డీల ద్వారా పాకిస్తాన్- అమెరికా కలిసి అక్కడి ఆయిల్ రిజర్వ్స్ ను అభివృద్ధి చేస్తాయని అన్నారు. ఏదో ఒకరోజు పాకిస్తాన్.. భారత్ కు ఆయిల్ అమ్మే పరిస్థితి రావొచ్చని చెప్పారు.

రష్యాతో భారత్ క్రమం తప్పకుండా క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోండటం.. సత్సంబంధాలను కొనసాగిస్తోండటం, ఇతర వాణిజ్య కార్యకలాపాల వల్లే ఆగస్టు 1 నుండి భారతీయ దిగుమతులపై 25 శాతం టారిఫ్, అదనపు జరిమానాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

ఆ వెంటనే యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది. ఇరాన్ నుంచి ఆయిల్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. ఇరాన్ తో శత్రుత్వాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో- ఆ దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా.

కంచన్ పాలిమర్స్, ఆల్ కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రమ్ణిక్ లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్, పెర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ లు ఈ జాబితాలో ఉన్నాయి.

2024 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో ఈ ఆరు సంస్థలు కూడా మిథనాల్, టోలున్, పాలిథిలిన్ వంటి కెమికల్స్ ను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నాయి. వీటితో పాటు టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, ఇండోనేసియాలకు చెందిన పలు ఆయిల్ కంపెనీలపైనా ఆంక్షల కొరడా ఝుళిపించింది అమెరికా.

ఆయా కంపెనీలు సమష్టిగా 10 మిలియన్ల డాలర్ల కంటే విలువైన పెట్రోకెమికల్స్‌, దాని అనుబంధ వస్తువులను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. తమదేశాన్ని అస్థిర పరిచే కార్యకలాపాలకు బిలియన్ల డాలర్ల అక్రమ నిధులను పరోక్షంగా ఇరాన్ కు అందజేసేలా సహాయపడ్డాయని వ్యాఖ్యానించింది.