ANDHRAPRADESH:తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. కాగా, ఆకస్మికంగా విశాఖను వాన ముంచెత్తింది. రెండు గంటల పాటు కుండ పోత కురిసింది. ఇటు బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. ఈ రోజు రెండు అల్పీ పడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం పైన తాజాగా అలర్ట్స్ జారీ చేసింది. భారీ వర్షాల పైన అప్రమత్తం చేసింది.
విశాఖను ఉరుములు.. పిడుగులతో భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా వచ్చిన వాన నగరాన్ని ముంచెత్తింది. నీటి ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోయాయి. సుమారు రెండు గంటల పాటు జోరున కురిసిన వర్షానికి కాలువలు,డ్రెయినేజీలు నిండిపోయి వరదలా పారింది. పలు ప్రాంతాల్లో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగింది. దీని నుంచి ఆకస్మికంగా కురిసిన వర్షంతో సేద తీరారు. రోడ్లపై పార్కుచేసిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. సీతమ్మధారలో 34.0,ధారపాలెంలో 24 మి.మీ. వర్షపాతం నమోదైంది.
పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. ఇంకా ఆదివారం మధ్యప్రదేశ్‌లోని మధ్య, ఉత్తర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో సోమవారం మధ్యప్రదేశ్‌లోని వాయువ్య భాగంలో అల్పపీడనం ఏర్పడనుంది.
ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఒడిశా, శ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లో పలుచోట్ల భారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈనెల 17వ తేదీ నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు పెరగనున్నాయి.ఈ నెల 18, 19న కోస్తాలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi