ANDHRAPRADESH:కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల నిర్వహణ పైన ఏపీ దేవాదాయ శాఖ -టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ ఛైర్మన్.. అధికారులతో తిరుమలలో సమావేశం నిర్వ హించారు. గతంలో సీఎం చంద్రబాబు దగ్గర జరిగిన సమావేశంలో ఆలయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ముందుకు రాగా.. వాటి పైన ఈ సమావేశంలో చర్చించారు.
మంత్రి ఆనం తిరుమలలో టీటీడీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. గతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో దేవాదాయ శాఖ - టీటీడీకి సంబంధించిన సమిష్టి అంశాల పైన రెండు విభాగాలు చర్చించి.. ఒక పరిష్కారానికి రావాలని సూచించారు. అందులో భాగంగా ఈ సమావేశం జరిగింది. కాగా, దేవాదాయ చట్టం ప్రకారం 9 శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతంకు పెంచినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న అర్చక నిరుద్యోగులుగా ఉన్న అర్చక స్వాములకు భృతి ఇవ్వాలనీ మేనిఫెస్టో ఉందని గుర్తు చేసారు. ఆ మేరకు రాష్ట్రంలో 590 వేద పండితులు రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. వారికి 3 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్ నిర్మాణంలో ఉన్న ఆలయాలకు 147 కోట్లు విడుదల కాగా నిలిచిపోయాయని వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో 11 కోట్లు నిధులు మిగతా ఆలయాల కు రావాల్సి ఉందని పేర్కొన్నారు. వీటింటిని చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు,అధికారు లు చెప్పారన్నారు. విజయవాడ దుర్గ గుడికి వెళ్లేందుకు మరో రోడ్డు మార్గం వేసేందుకు టీటీడీ సహకారం కావాలని కోరారు.
టీటీడీలో అన్యమతస్థులు ఉండేది వాస్తవమని.. కేంద్రమంత్రి బండి సంజయ్ టీటీడీలో పనిచేస్ తున్న వేయి మంది అన్యమతస్థులు ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసిన మంత్రి ఆనం.. టీటీడీ కాలేజీ,పాఠశాలల్లో ఉన్న 192 పోస్టులను ఒప్పంద లెక్చరర్ లతో భర్తీ చేసేందుకు చర్చించినట్లు వెల్లడించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi