Hot Posts

6/recent/ticker-posts

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

HYDERABAD:తెలంగాణలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని పని చేస్తున్న 12,055 మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల సేవలు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు అన్నట్లుగా గ్రామాల్లో నిత్యం తిరుగుతూ గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదో శుభవార్తగా భావించవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల సర్సీస్ ను మార్చి 31, 2026 వరకు పొడిగించింది. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని పని చేస్తున్న 12,055 మంది ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకూ సర్వీసు పొడిగించింది. దీంతో తెలంగాణలోని 51,451 మంది కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. అంతేకాక.. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసును కూడా ప్రభుత్వం మరో ఏడాది పాటు కొనసాగించే ఆలోచనలో ఉంది.

మరోవైపు ఇటీవల తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు భారీ ఉపశమనం కలిగించింది. మూడు నెలలకు సంబంధించి జీతాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 53 వేల మందికి పైగా మల్టీ పర్పస్ వర్కర్లకు భారీ ఊరట లభించింద.