HYDERABAD:ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల్లోనూ పాకిస్థాన్ సంధించిన టర్కీ డ్రోన్ లను భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్-400 కూల్చేసింది. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ భారీగా డ్రోన్ ల వినియోగం పెరిగిపోయింది. అన్ మేనెడ్ వెహికల్స్(UAV) గా వీటికి పేరుంది. ఈ క్రమంలో హైదరాబాద్ బిట్స్ పిలానికి చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అద్భుతం చేశారు. 300 కి.మీ వేగంతో, రాడార్ వ్యవస్థకు చిక్కని కామికేజ్ డ్రోన్ లను తయారు చేశారు. తమ హాస్టల్ రూంలోనే వీటిని తయారు చేయడం విశేషం.
ప్రస్తుతం ప్రపంచంలో డ్రోన్ టెక్నాలజీ అధికంగా పెరిగిపోతోంది. ఆధునిక యుద్ధాల్లో వీటి పాత్ర అధికంగా ఉంటూ వస్తోంది. ఇటీవల జరిగిన భారత్- పాక్ యుద్ధంలో పాకిస్థాన్ నుంచి దూసుకొచ్చిన 600కు పైగా డ్రోన్ లను భారత్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చింది. ఈ డ్రోన్ లను పాకిస్థాన్ కు టర్కీ చేరవేసింది. అటు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇరు దేశాలు డ్రోన్ టెక్నాలజీనే వాడుతున్నాయి. అలానే ప్రపంచ దేశాలు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని అలవరచుకుంటున్నాయి.
డ్రోన్ లు అంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. వీటిని మానవరహిత వైమానిక వాహనాలు(UAV) అని కూడా అంటారు. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా లేదా ఆటోమేటిక్ గా ఆపరేటింగ్ చేస్తారు. ఈ వాహనాలు రోబోటిక్స్, ఏరోనాటిక్స్ టెక్నాలజీ అనుసంధానం చేయడం ద్వారా పనిచేస్తాయి. ఇక డ్రోన్ లను ఫొటోగ్రఫీ, వీడియో, మ్యాపింగ్, నిఘా, వ్యవసాయం, ప్యాకేజింగ్, పరిశోధన.. తదితర రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తారు.
ప్రస్తుతం భారత్ వద్ద రుస్తోమ్- 2(తపాస్) డ్రోన్ లు ఉన్నాయి. రుస్తోమ్- 2ను తపాస్- బీహెచ్ డ్రోన్ లు అని కూడా పిలుస్తారు. TAPAS అనగా టాక్టికల్ ఎయిర్ బార్న్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ఏరియల్ సర్వీలెన్స్ అని అర్థం. ఇవి మానవ రహిత వాహనాలు. ఈ డ్రోన్ లకు ఆయుధాలు, రాడార్లు, ఇతర యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బిట్స్ పిలానీకి చెందిన ఇద్దరు విద్యార్థులు జయంత్(మెకానికల్), సౌర్య(ఎలక్ట్రికల్) అద్భుతం చేశారు.
ఈ ఇద్దరు విద్యార్థులు తమ హాస్టల్ రూమ్ లోనే అత్యాధునిక డ్రోన్ లను తయారు చేశారు. 300 కి.మీ వేగంతో, రాడార్ కు చిక్కని కమికేజ్ డ్రోన్‌లను తయారు చేశారు. అంతే కాదు.. భారత సైన్యానికి ఆ డ్రోన్లను విక్రయిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ఈ డ్రోన్ లను తయారు చేశారు. రెండు నెలల్లోనే జమ్ము కాశ్మీర్, హరియాణా, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ లోని ఆర్మీ యూనిట్స్ కు ఈ డ్రోన్ లను విక్రయించారు. వీరు చేసిన కేమికేజ్ డ్రోన్ లు 300 కిలీమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రాడార్ ప్రూఫ్, కచ్చితత్వంతో ఈ డ్రోన్ లు పనిచేస్తాయి.