ANDHRAPRADESH:వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. పలు ప్రధాన మార్గాల్లో కొత్తగా వందేభారత్ రైళ్లను మరింతగా పెంచేలా కసరత్తు జరుగుతోంది. వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కిన తరువాత కొత్త సర్వీసు ల పైన నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, కొన్ని మినహా మెజార్టీ వందేభారత్ రైళ్లకు వందశాతం ఆక్యుపెన్సీ రేషియో ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో, వందేభారత్ టికెట్ రిజర్వేషన్ విధానం మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
వందేభారత్ రైళ్లలో రిజర్వేషన్ విధానం రియల్ టైం కు అనుసంధానం చేయాలని రైల్వే అధికా రులు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా దక్షిణ రైల్వే లో పైలెట్ ప్రాజెక్టుగా కొత్త విధా నం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఇతర రైళ్ల తరహాలోనే వందేభారత్ కు రిజర్వే షన్ ఛార్జ్ షీట్ వెల్లడయ్యే వరకు టికెట్ ఖరారు సమాచారం కోసం వేచి ఉండాల్సి వచ్చేది. తాజా గా రైల్వే నిర్ణయం మేరకు ఎనిమిది గంటల ముందు రిజర్వేషన్ ఛార్ట్ లను ప్రకటిస్తున్నారు. ఇక.. వందేభారత్ కు రిజర్వేషన్ సమయంలో పలు ప్రధాన మార్గాల్లో నిరంతరం భారీగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. అదే సమయంలో టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణీకులతో.. ఆ సీట్లు మిగిలి పోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు.
అందులో భాగంగా వందేభారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. దేశం మొత్తంగా ఈ విధానం అమలుకు ముందు దక్షిణ రైల్వే పరి ధి లో ఎంపిక చేసిన వందేభారత్ రైళ్లల్లో కొత్త విధానం అమలు చేయనున్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా రైలు బయల్దేరే 15 నిమిషాలకు ముందు ఖాళీ సీట్ల వివరాలు తెలు పుతామని వెల్లడించిన అధికారులు..ఆ సీట్లు ప్రయాణికు లు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈసౌకర్యం మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం (నెం.20631), తిరువనంతపురం-మంగళూరుసెంట్రల్(నెం.20632),చెన్నై ఎగ్మూర్-నాగర్‌కోయిల్(నెం.20627),నాగర్‌కోయిల్-చెన్నై ఎగ్మూర్ (నెం.20628), కోయంబత్తూర్-బెంగళూరు కంటోన్మెంట్ (నెం.20642), చెన్నై సెంట్రల్-విజయవాడ (నెం.20677). మంగళూరు సెంట్రల్-మడగావ్ (నెం.20646), మదురై-బెంగళూరు కంటోన్మెంట్ (నెం.20671) తదితర 8 వందే భారత్ రైళ్లకు కల్పించినట్లు అధికారులు తెలిపారు.