ANDHRAPRADESH:డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.
శనివారం కొత్తపేటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తప్పిందన్నారు.
తల్లికి వందనంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేసామన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు అమలవుతుందన్నారు. వైసిపి హయాంలో రోడ్లపై చిన్న గుంత కూడా పూడ్చని విషయం గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.