ANDHRAPRADESH:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన అమలాపురం వీరభద్రం కిడ్నీ సమస్యతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.
ఆయన చికిత్స నిమిత్తం 35 లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని దాతలు ఆదుకోవాలని కోరడంతో వాడపాలెం హైస్కూల్ విద్యార్థులు పన్నెండు వేల రూపాయలు (12,000/-) సమకూర్చారు. అలాగే గ్రామ సర్పంచ్ త్సమా బాబు గారు పది వేల రూపాయలు (10,000/-) ఆర్ధిక సాయం చేశారు.
ఈ సొమ్మును గ్రామ సర్పంచ్ త్సామా బాబు గారు,బండారు బులితాత గారి చేతుల మీదుగా బాధితుని కుటుంబ సభ్యులకు అందజేశారు.చిన్నారులు చేసిన మంచి పనికి పలువురు ప్రశంచించారు.అలాగే ఇంకా ఎవరైనా దాతలు సాయం చేసి వీరభద్రాన్ని కాపాడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Vijaya Babu. I
Staff Report | Konaseema