HYDERABAD:తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకుల కోసం ప్రధాన రూట్లలో టికెట్ రాయితీలు ప్రకటించింది. ఇప్పటికే రద్దీ ఉన్న మార్గాల్లో ఆక్యుపెన్సీ పెంచుకొనే విధంగా ఆర్టీసీ నిర్ణయాలు అమలు చేస్తోంది. అదే విధంగా టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి ప్రధాన ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్లోనూ మార్పులు ప్రారంభించింది. ఇక, ప్రయివేటు ఆపరేటర్లకు ధీటుగా సేవలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్న ఆర్టీసీ.. రెండు ముఖ్యమైన రూట్లలో టికెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాలలో నడుస్తున్న టీజీఎస్ఆర్‌టీసీ బస్సుల టికెట్ ధరలను సంస్థ భారీగా తగ్గించింది. ఛార్జీలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీలు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయవాడకు గరుడ ప్లస్ బస్సు టికెట్ ధర రూ. 635 నుంచి రూ. 444కు, గరుడ క్లాస్ ధర రూ. 592 నుంచి రూ. 438కు, రాజధాని రూ. 533 నుంచి రూ. 448, లగ్జరీ సూపర్ క్లాస్ ధర రూ. 815 నుంచి రూ. 685కు తగ్గించింది. అలాగే బెంగళూరు మార్గంలో సూపర్‌లగ్జరీ బస్సు టికెట్ ధర రూ. 946 నుంచి రూ. 757కు, లహరి ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ రూ. 1569 నుంచి రూ. 1177కు, లహరి ఏసీ స్లీపర్ బెర్త్ కమ్ సీటర్ ధర రూ. 1203 నుంచి రూ. 903కు, బెర్త్ రూ. 1569 నుంచి రూ. 1177కు తగ్గించింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi