Hot Posts

6/recent/ticker-posts

తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ - రూట్, షెడ్యూల్ ఖరారు..!!


ANDHRAPRADESH:తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే నడుస్తున్న వందేభారత్ లో ఒకటి మినహా అన్నింటికీ ఆక్యుపెన్సీ బాగుంది. దీంతో.. ప్రధాన మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. నిత్యం ప్రయాణించే ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండటం తో ఆ మార్గాల్లో వందేభారత్ ను తీసుకొచ్చేలా రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ కేటాయించారు.

మరో వందేభారత్

వందేభారత్ రైళ్ల కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్తగా పూణే నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. పూణేకు ఉన్న డిమాండ్ కు అనుగుణంగా కొత్తగా రైల్వే
సికింద్రాబాద్ నుంచి పుణె వరకు దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పుణెకు కేవలం శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఒకటే నడుస్తోంది. ఇది మధ్యాహ్నం నుంచి బయలుదేరు తుంది. అలా కాకుండా వందేభారత్ నుంచి ఉదయమే ప్రారంభించేలా చూడాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

సికింద్రాబాద్ నుంచి పూణే

సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ కు ఆక్యుపెన్ పెరగటం లేదు. ఈ రైలు ప్రవేశపెట్టడమే 20 రేక్స్ తో ప్రవేశపెట్టారు. ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోతుండటం తో బోగీలు కుదించి ఎనిమిది బోగీలతో నడపబోతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నాగపూర్ కు నాలుగు రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి పుణెకు వందేభారత్ సిట్టింగ్ కాకుండా స్లీపర్ సర్వీస్ ను రాత్రివేళ ప్రారంభిస్తే బాగుంటుందని తొలుత అధికారులు భావించారు. కాగా.. హైదరాబాద్, పుణె.. రెండు నగరాలు ఐటీ నగరాలు కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆక్యుపెన్సీ బాగుంటుందని నివేదిక ఇచ్చారు. అందుకు తగినట్లుగా ప్రవేశపెడితే ఆదరణ పొందడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

తక్కువ సమయంలోన

సికింద్రాబాద్ - పూణే మధ్య వందేభారత్ అందుబాటులోకి వస్తే దాదాపు మూడు గంటల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా మహారాష్ట్ర, కర్ణాటక లోని ప్రధాన ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ కనెక్టివీ పెంచేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తు న్నారు. ఇక.. ఇప్పటికే విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి ఖరారైన వందేభారత్ త్వరలో పట్టాలెక్కాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోంది. అదే విధంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం వేళ.. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, విజయవాడ నుంచి అయోధ్య రెండు మార్గాల్లో స్లీపర్ కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. దీని పైన రైల్వే శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.