టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. రాష్ట్రంలోని వ్యవసా య మార్కెట్లకు చైర్మన్లను.. నియమించారు. మొత్తం 66 మార్కెట్ యార్డులు ఉండగా.. వీటిలో 22 పెద్దవి ఉన్నాయి.
ANDHRAPRADESH:టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లకు చైర్మన్లను.. నియమించారు. మొత్తం 66 మార్కెట్ యార్డులు ఉండగా.. వీటిలో 22 పెద్దవి ఉన్నాయి. మిగిలిన వాటిలో చిన్నవి, మరింత చిన్నవి కూడా ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ పదవులను భర్తీ చేయాలని పార్టీ నుంచి ఒత్తిడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయా పదవులను భర్తీ చేశారు. మొత్తంగా 66 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు నియామకాలు జరిగాయి.
ఇక, కూటమి ధర్మానికి కట్టుబడి.. జనసేనకు 9 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చారు. అలాగే.. మరో మిత్రపక్షం బీజేపీ కూడా 4 పదవులు దక్కించుకుంది. ఇక, టీడీపీకి దక్కిన 53 పదవుల్లో మెజారిటీ పదవులను మహిళలకు కట్టబెట్టడం సంచలనంగా మారింది. 35 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను చంద్రబాబు మహిళలకు అప్పగించారు. గతంతో పోల్చుకుంటే.. ఇది హిస్టరీ క్రియేట్ చేసినట్టేనని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎక్కడా సిఫారసులు లేకుండా.. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా చంద్రబాబు ఈ పదవులు ఫిల్ చేశారని అంటున్నారు.
ఇక, 66 చైర్మన్ పదవుల్లో టీడీపీకి ఆది నుంచి బలమైన అండగా ఉన్న బీసీలకు 17, ఎస్సీలకు 10, ఎస్టీల కు 5, మైనారిటీలకు 5 చొప్పున చైర్మన్ పదవులు అప్పగించారు. తద్వారా.. అన్ని వర్గాలకు సీఎం చంద్ర బాబు న్యాయం చేసినట్టు అయింది. ఇదే సమయంలో వైసీపీ వ్యూహాత్మక రాజకీయాలకు కూడా ఆయన చెక్ పెట్టారు. మహిళలను సెంట్రిక్‌గా చేసుకుని.. వారికి చంద్రబాబు పదవులు ఇవ్వడం లేదని.. ప్రచారం చేస్తున్న వైసీపీకి పరోక్షంగా చంద్రబాబు చేసిన నియామకాలు.. భారీ షాక్ ఇచ్చాయని అంటున్నారు టీడీపీ నాయకులు.

Shakir Babji Shaik
Editor | Amaravathi