HYDERABAD:గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు పని కల్పించి.. ఆర్థికంగా భరోసాను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. 2006 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ పథకం కింద పేదలకు 100 రోజల పని దొరుకుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏపీలో ఉపాధి కూలీని రూ. 300 నుంచి రూ. 307కు పెంచిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కూలీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం
గ్రామీణ ప్రాంతాల్లో కరువు పనికి వెళ్లే కూలీలకు గుడ్ న్యూస్. ఇప్పటికే కూలీ రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు దురదృష్టవశాత్తు మృత్యువాత పడుతున్న ఘటనలు అధికం అవుతున్న తరుణంలో వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని.. ఈ మేరకు వారికి బీమా పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల పరిహారం లభించనుంది.
ఈ బీమా పథకానికి 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ బీమా పథకంలో చేరవచ్చు. అయితే ఏటా తమ ఖాతా నుంచి రూ.20 బీమా ప్రీమియంను చెల్లించడానికి అనుమతిస్తూ లెటర్ ఇవ్వాలి. ప్రతీ సంవత్సరం జూన్ ఒకటి నుంచి మే 31 వరకు బీమా అమల్లో ఉంటుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi