ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు తుది కసరత్తు చేస్తోంది. పీఎం కిసాన్ తో పాలుగా ఈ పథకం తొలి విడత నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల జాబితా ను ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉండీ జాబితాలో పేరు లేని రైతుల కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ నెల 18న పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు సమస్య పరిష్కార మార్గాలను అధికారులు నిర్దేశించారు.
మరో అవకాశం
అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో పేరు లేని రైతులకు మరో అవకాశం కల్పించారు. లిస్టులో పేరు లేని రైతులు కారణాలు తెలుసుకొని.. సరైన పత్రాలు ఇవ్వటం ద్వారా వాటిని పరిశీలించి తిరిగి అవకాశం కల్పిస్తారు. రైతులు తమ జాబితాలను స్థానిక సచివాలయాలతో పాటుగా వాట్సాప్ ద్వారా తనిఖీ చేసుకొనేలా ఏర్పాట్లు చేసారు. భూ యజమానులతో పాటుగా.. కౌలు రైతులకు ప్రత్యే క గ్రీవెన్స్ విధానం ద్వారా వారికి అర్హత కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డులు పొందాలి. ఖరీఫ్ లో ఈ - పంట లో వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా అర్హత పరిశీలించి ఈ పథకం కింద సాయం అందిస్తారు. డీ - పట్టాదారులు, ఇనాం, అసైన్డ్ భూములు సాగు చేసే వారు ఈ పథకానికి అర్హులు.
ఇలా చేయండి
దేవాదాయ భూముల్లో సాగు చేస్తున్న వారిని కౌలు రైతుల కింద గుర్తించి సాయం అందిస్తారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే పథకానికి అర్హులు. ఒకే కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉంటే కుటుంబ సర్వేలో సచివాలయాల్లో వేరు చేయించుకోవాలి. రైతు సేవా కేంద్రంలో గ్రీనెన్స్ మాడ్యుల్ లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్ ల్యాండ్ లో రైతు ఆధార్ నెంబర్ తప్పుగా అనుసంధానం చేసి ఉంటే.. సంబంధిత సిబ్బందిని సంప్రదించి సరైన నెంబర్ ను అనుసంధానం చేయాలి. వెబ్ ల్యాండ్ లో ఆధార్ తో జత కాలేదని గుర్తించినా.. చనిపోయిన వారి భూమి మ్యూటేషన్ జరగక పోయినా.. వెబ్ ల్యాండ్ కు సంబంధించి కారణాలు వీఆర్వో ద్వారా సరి చేసుకోవాలి. రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత కోసం
అటవీభూమి సాగుదారులు గిరిభూమి పోర్టల్ లో సమస్యలు ఉంటే గిరిజన సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ తప్పుగా నమోదైనా.. మ్యూటేషన్ కోసం పీఓను సంప్రదించి సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల పేర్లు పరిశీలనకు రాలేదంటే.. వారి భూమి రెవన్యూ వెబ్ ల్యాండ్ లో ఆధార్ తో జత కాలేదని గుర్తించాలి. రెవిన్యూ అధికారిని సంప్రదించి ఆధార్ ను వెబ్ ల్యాండ్ రికార్డులతో అనుసంధానం చేసి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi