ఏపీలో నిత్యం రాజకీయంగా రావణకాష్టంగా ఉండే నియోజకవర్గాల్లో తాడిపత్రి కూడా ఒకటి. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఆ ప్రభావం తగ్గినా పోటా పోటీ రాజకీయాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. ఇందులో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో 2019 ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ జేసీ కుటుంబ హవాకు గండి కొట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అప్పటి నుంచీ వారికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. దీంతో జేసీ కుటుంబం అధికారంలో ఉన్నా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తన ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో తాను హోరాహోరీ తలపడుతున్నా టీడీపీ నుంచి , ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదన్న ఆక్రోశమో, మరో కారణమో తెలియదు కానీ.. తాము వైసీపీలోకి రావచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నకు ఆస్తులు పోయినా, తన కొడుకుని జైల్లో వేయించినా బాధపడలేదని, కానీ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన ఇంట్లోకి వచ్చి దాడి చేసి వెళ్లాడన్నదే బాధగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి ఇల్లు అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యిందని, దానిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. తాము తాడిపత్రి అభివృద్ధి గురించే నిత్యం ఆలోచిస్తామని, అందుకే మున్సిపాలిటీలోనూ గెలిచామన్నారు.
అయితే వైసీపీ నాయకులపై పనిగట్టుకుని వెళ్లట్లేదని, లీగల్ గానే వెళ్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యకర్తల జోలికి అయితే రావట్లేదన్నారు. అక్కడితో ఆగకుండా త్వరలో తాము వైసీపీలోకి రావచ్చంటూ జేసీ హింట్ ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీతో తమకు చాలా అనుబంధం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మాత్రం కక్ష ఉందని, అతనిపై లీగల్ గా వెళ్తానని జేసీ ప్రకటించారు. జేసీ మాటలు చూస్తుంటే కేతిరెడ్డి తప్ప వైసీపీపై కక్ష లేదని, తనకు సహకరించరని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లేందుకు అయినా రెడీ అని చెప్పేసినట్లు కనిపిస్తోంది.
తనకు ఆస్తులు పోయినా, తన కొడుకుని జైల్లో వేయించినా బాధపడలేదని, కానీ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన ఇంట్లోకి వచ్చి దాడి చేసి వెళ్లాడన్నదే బాధగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి ఇల్లు అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యిందని, దానిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. తాము తాడిపత్రి అభివృద్ధి గురించే నిత్యం ఆలోచిస్తామని, అందుకే మున్సిపాలిటీలోనూ గెలిచామన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi