HYDERABAD:తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడాలని మీరు కోరుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ మరో ప్యాకేజీని ప్రకటించింది. ఇదివరకు యాత్రికుల కోసం సిటీలోని పలు డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ కోసం ముచ్చింతల్లోని అనంతపద్మనాభ స్వామి, షాద్నగర్రామలింగేశ్వర స్వామి, అమ్మపల్లి సీతారామస్వామి, వెండికొండ సిద్దేశ్వర స్వామి దేవాలయాల దర్శనం కోసం ప్రత్యేక టూర్ బస్సులు నడిపింది. ఈ ప్యాకేజీకు మంచి స్పందన రావడంతో తాజాగా మరో ప్యాకేజీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
టీజీఎస్ ఆర్టీసీ సూర్యాపేట డిపో యాజమాన్యం భక్తుల కోసం స్పెషల్టూర్ప్యాకేజీని ప్రకటించింది. సూర్యాపేట పట్టణ, జిల్లా పరిసర ప్రాంత భక్తులకు గొప్ప శుభవార్తను అందించింది. సూర్యాపేట డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు పలు పుణ్య క్షేత్రాలకు సేవలందించనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. సూర్యాపేట డిపో నుంచి పలు పుణ్యక్షేత్రాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం డిపోలు కూడా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాయి.
ఇక సూర్యపేట డిపో నుంచి విజయవాడ (కనకదుర్గ ఆలయం), ద్వారకా తిరుమల, సామర్లకోట, పిఠాపురం, మంగళగిరి (పానకాల లక్ష్మీ నరసింహా స్వామి), (12వ శక్తి పీఠం), సింహాచలం, శ్రీ కూర్మం, అర్షవెల్లి, వైజాగ్, అన్నవరం యాత్రలకు సూపర్లగ్జరీ బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ రాత్రి 11 గంటలకు సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరి తిరిగి 04వ తేదీ రాత్రి 8 గంటలకు సూర్యాపేట బస్ స్టేషన్ చేరుకుంటుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇక బస్ ఛార్జీలు పెద్దలకు రూ. 3400, పిల్లలకు రూ. 1800 గా ఉందని తెలిపారు. 9948303712 ఈ నెంబరుకు ఫోన్పే, గూగుల్ పే సౌకర్యం కూడా ఉందని తెలిపారు.