Hot Posts

6/recent/ticker-posts

శీర్షిక: అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు: మంజుల పత్తిపాటి


జీవితంలో ఎన్ని ఆటుపోట్లుఎదురైనా
ఎన్ని తుపానులు వచ్చిన రక్షణ కవచమై
నిలిచి ప్రేమను పంచుతు...
బత్రుకర్ధం చెప్పిన భగవంతుడు నాన్న ..!
గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా
చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజంపై
తట్టి గెలుస్తావులే అని దగ్గరకి
తీసుకుని హత్తుకునే వ్యక్తి నాన్న..!
ఓ ఆప్యా యత, ఓ భరోసా, ఓ త్యాగం నాన్న..!
తొలి గురువు, స్నేహితుడు, మార్గదర్శి నాన్న..!
తానే బొమ్మయి ఆడించే వ్యక్తి నాన్న..!
సరైన మార్గంలో పయనింప చేస్తూ
గమ్యా న్ని పరిచయం చేసిన వ్యక్తి నాన్న..!

నాన్న నాతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలను మధురమైన స్మృతులుగా మలచుకున్న.... 
మీ ప్రేమ నా కలలకు ఇంధనంలా పనిచేస్తుంది
నాన్న మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. 
అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలతో..


రచన✍️మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్,
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ,
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now