మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
....
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ఆరోపణలు
నేడు అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు
క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారాం ఆసుపత్రికి తరలింపు..
ఫార్ములా ఈ రేసింగ్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి పది గంటలకు ACB కార్యాలయంలో విచారణ కు వెళ్లనున్నారు. ఈ కారు రేసు కేసులో నీధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీలు విచారించాయి. ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్ధ ప్రతినిధులను గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ ప్రశ్నించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను విచారించింది. కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయనున్నది. కేటీఆర్ వెంట బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఏసిబి కార్యాలయం వచే అవకాశాం ఉంది. ఈ నేపథ్యంలో ఏసిబి కార్యలయం రూట్ మ్యాప్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారాం ఆసుపత్రికి తరలింపు..
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆమెను ఆసుపత్రి గ్యాస్ట్రోలజీ విభాగంలో చేర్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 78 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 7న కొన్ని స్వల్ప ఆరోగ్య సమస్యల కారణంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (IGMC)లో చేరారు. అక్కడ, వైద్యుల బృందం ఆమెకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 2022 సంవత్సరంలో కూడా, ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో రెండుసార్లు చేరారు. ఆ సమయంలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వైరల్ జ్వరం, తరువాత కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరింది.
నేను శాంతి కోసం చాలా చేస్తాను.. కానీ నాకు క్రెడిట్ దక్కదు
మే నెలలో జరిగిన సైనిక దాడులలో భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించిన విధంగానే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా శాంతి చర్చల ఒప్పందాన్ని కుదిర్చడానికి తాను ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫోన్‌లో చాలా చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన తన మెసేజ్ లో పేర్కొన్నారు. దాడులను ఆపడానికి ఇరాన్, ఇజ్రాయెల్ త్వరలో ఒక ఒప్పందానికి రావచ్చని ట్రంప్ అన్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై ట్రంప్ దాడి చేస్తూ, తన పదవీకాలంలో తీసుకున్న అనేక మూర్ఖపు నిర్ణయాల వల్ల పరిస్థితి మరింత దిగజారిందని, దానిని తిరిగి గాడిలో పెట్టడానికి కూడా తాను ప్రయత్నిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య త్వరలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు!
నేడు సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. 10.40కి విశాఖ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్కు హోటల్ వరకూ అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.05 నోవాటెల్ హోటల్‌కు వెళ్లి.. అధికారులతో యోగా దినోత్సవంపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు నోవాటెల్ హోటల్‌లో బయలుదేరి.. 2.50 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ సెంటర్‌లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమై యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారమే వైజాగ్ చేరుకున్నారు.
నేడు అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్‌లో ఉంటున్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు చనిపోయారు. ఇందులో విజయ్ రూపానీ ఉన్నారు. డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా 3 రోజుల తర్వాత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ఇక సోమవారం అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
నేడు తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం (జూన్ 17) ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు వేదికల తయారీ, సాంకేతిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, రైతునేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు, అలాగే విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో సుమారు 1,500 మంది రైతులు ప్రత్యక్షంగా హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించబడి ఉండగా, తాజాగా మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, కొత్త పంటల సాంకేతికతపై చర్చలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు.
ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలు తిరస్కరించిన ఇరాన్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం సాగుతోంది. ఇరుపక్షాలు క్షిపణులు ప్రయోగించుకుంటున్నారు. దీంతో ఆస్తితో పాటు ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇరాన్-ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేసుకోవాలని.. ఇదే అనుకూల సమయం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కెనడాకు వెళ్లే ముందు వైట్ హౌస్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఖతార్, ఒమన్ దేశాలు కూడా మధ్యవర్తులుగా ముందుకొచ్చి శాంతి చర్చలు జరుపుతామని పేర్కొన్నాయి. అందుకు ఇరాన్ నిరాకరించింది. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతుండడంతో ప్రపంచ అధినేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయేమోనని భయాందోళన చెందుతున్నారు. 4 రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్‌లో మరణాల సంఖ్య పెరిగింది. 230 మంది చనిపోయారు. ఇందులు 90 శాతం మంది పౌరులేనని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 10 మంది చనిపోయారు. ఇందులో పిల్లలు అన్నారు.
మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, మధ్య మహారాష్ట్ర దుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు, ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. ఈ వాతావరణ వ్యవస్థ దక్షిణ-పశ్చిమ దిశగా వాలి ఉన్నదని, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. శనివారం ఉత్తరాంధ్ర తీరాన్ని ప్రభావితం చేసిన పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆవర్తనం, తాజాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త ఆవర్తనంలో కలిసిపోయిందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు సూచించారు. దక్షిణ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణాలో కూడా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సోమవారం నాడు ఉత్తర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే సగటున 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ఆరోపణలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ప్రధాన శత్రువు ట్రంపేనని.. ఆయనను చంపాలని టెహ్రాన్ కురుకుంటోందని తెలిపారు. ట్రంప్ సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు అని పేర్కొన్నారు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ట్రంప్ ఇష్టపడరన్నారు. ఇక ప్రత్యర్థికి లొంగిపోరన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదనే ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఇరాన్‌కు ట్రంప్ ప్రధాన శత్రువుగా మారారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ను చంపాలని టెహ్రాన్ భావిస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రపంచ దేశాలకు ఇరాన్ పెనుముప్పుగా మారుతోందన్నారు. ముప్పును తొలగించేంత వరకు ఇజ్రాయెల్ పోరాడుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చూసింది. అణు స్థావరాలు బాగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌లో స్వల్ప భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 2.5గా నమోదైంది. ఇక 14 మంది అణు శాస్త్రవేత్తలు కూడా చనిపోయినట్లు సమాచారం.
నేడు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. టాస్ వేయాల్సిన అవసరం వస్తుందా!
నేడు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హైకోర్టు తీర్పు సీల్డ్ కవర్‌ను అధికారులు తెరవనున్నారు. కవర్‌లో విజేత ఎవరనేది తేలనుందా? లేక టాస్ వేయాల్సిన అవసరం వస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఫలితంపై హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చి దాదాపుగా 30 రోజులు అవుతోంది. దాంతో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీలు సమానంగా 14, 14 సీట్లు గెలిచాయి. అప్పటి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదని వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. కేశినేని నాని ఓటు చెల్లుతున్నట్టు హైకోర్టు తీర్పు ఇస్తే.. చైర్మన్ పీఠం టీడీపీ సొంతం అవుతుంది. ఒకవేళ కేశినేని నాని ఓటు చెల్లుబాటు కాదని తీర్పు వస్తే.. టాస్ వేసి ఎవరు చైర్మన్ అనేది ప్రకటించే అవకాశం ఉంది. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నిక ఫలితం మూడన్నరేళ్లుగా కోర్టు పరిధిలో ఉంది. నేడు మున్సిపాలిటీ చైర్మన్ ఎవరన్నది తేలిపోనుంది.