Hot Posts

6/recent/ticker-posts

ప్రకాశం జిల్లా పొదిలి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి అరెస్ట్కు రంగం సిద్ధం


అమరావతి: ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలపై జరిగిన దాడి ఘటనలో దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అరెస్ట్ చేసేందుకు పోలీసులు నోటీసులు పంపారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దర్శి ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలొచ్చినప్పటికీ పోలీసుల నోటీసులపై ఆయన స్పందించారు.

హైదరాబాద్‌లోనే తాను ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి ప్రకటించారు. విచారణకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని స్పష్టం చేశారు. జగన్‌ పర్యటనలో శాంతి భద్రతలు కాపాడలేకపోయానని తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని, జగన్‌ పర్యటనకు అన్ని అనుమతులూ తీసుకున్నామని దర్శి ఎమ్మెల్యే చెప్పారు.

శాంతిభద్రతలు కాపాడాల్సింది పోలీసులని, తాను కాదని -వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ చెప్పడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now