రైల్వే ప్రయాణీకులకు రిజర్వేషన్ ఖరారు వేళ ఎదురవుతున్న ఇబ్బందులను తెలిగించేందుకు తాజాగా రైల్వే బోర్డు కీలక ప్రతిపాదన చేసింది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నా.. రైలు బయల్దేరటానికి నాలుగు గంటల ముందు వరకు నిర్ధారిత సమాచారం అందటం లేదు. దీంతో, ఇక నుంచి రైళ్లు బయలుదేరడానికి ఎనిమిదిగంటల ముం దే రిజర్వేషన్ చార్టులను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల రైల్వే అధికారులతో చేసిన సమీక్షలో భాగంగా ప్రయాణీకుల నుంచి పెద్ద సంఖ్యలో ఈ సమస్య పైన వస్తున్న అభ్యంతరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునే వెసులుబాటు కలగనుంది.
అదే సమయంలో టికెట్ వ్యవస్థ స్మార్ట్ గా ఉండటంతో పాటుగా పారదర్శకంగా.. సమర్ధవంతంగా ఉండేలా చర్యలు చేపట్టారు. రైలు బయల్దేరటానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ ఛార్ట్ ప్రకటన వలన ప్రయాణీకుల్లో తమ ప్రయాణం పైన అనిశ్చితి కనిపిస్తోంది. దీంతో, ఇక నుంచి ఎనిమిది గంటల ముందే ఈ ఛార్ట్ లను విడుదల చేయనున్నారు. ఖాళీలు ఉంటే కరెంట్ బుకింగ్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు.
వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ మరింత ముందుగానే తెలియడంతో దూర ప్రాంతాలు.. శివారు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రయోజన కరంగా ఉంటుంద ని అధికారులు భావిస్తున్నారు. ఇక, జులై ఒకటి నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి మార్పులు ఉంటాయి. ఇకపై అథెంటికేషన్ యూజర్స్ మాత్రమే తత్కాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi