Hot Posts

6/recent/ticker-posts

నియోజకవర్గాల పునర్విభజన, సీట్లు పెరిగేది ఇక్కడే.. ఇలా - కలిసొచ్చేదెవరికి..!!


ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతోంది. ఇప్పటికే కూటమి వర్సస్ వైసీపీ మధ్య వ్యూహా ప్రతి వ్యూహాలతో సమరం ఆసక్తి కరంగా మారింది. ఇక.. కేంద్రం తాజాగా కులగణనతో సహా జనగణన కు నిర్ణయించింది. దీంతో.. రాష్ట్ర విభజన సమయం నుంచి వేచి చూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. కేంద్రం పార్లమెంట్ స్థానాల దిశగానూ కసరత్తు చేస్తుం డటంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ.. ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఎక్కడె క్కడ ఈ స్థానాలు పెరగనున్నాయి.. ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది చర్చగా మారింది.

పునర్విభజన

తెలుగు రాష్ట్రాలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు..తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జన గణన 2027కి పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఏపీలో లోక్ సభ స్థానాల సంఖ్య లో మార్పుల పైన జనగణన తరువాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్ సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే.. ఇందులో దాదాపు ఆరు నుంచి ఎనిమిది వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పెరిగే సీట్లు ఇలా 

ఇక, జనగణనతో పాటుగా కులగణన చేస్తుండటంతో... రిజర్వేషన్ శాతాల్లో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఎస్సీ - ఎస్టీ రిజర్వ్ స్థానాల సంఖ్య పెరగటం ఖాయమని భావిస్తు న్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. పార్లమెంట్ కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు రెండు వరకు పెరిగేలా పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మూడు పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటు న్నారు. కూటమి కలిసే ఉంటుందని.. సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈ సారి సీట్లు కేటాయింపుకు అవకాశం వస్తుందని చెబుతున్నా రు. అదే విధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ, ఎస్సీ వర్గాల సంఖ్య పెరగటం ఖాయమని.. ఆ దామాషా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు.

ఎవరి ధీమా వారిది

నియోజకవర్గా ల పునర్విభజన లో సామాజిక సమీకరణాలు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 2009 లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ.. అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో.. రాజకీయం గా ఈ నియోజకవర్గాల పునర్విభజన.. సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్ కు కీలకం కానుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కో పార్లమెంట్ పరిధిని ఒక్కో జిల్లాగా మార్పు చేసారు. ఇక, ఇప్పుడు మహిళలకు స్థానాల రిజర్వేషన్.. లోక్ సభ సీట్ల పెంపు.. తదనుగుణంగా అసెంబ్లీ స్థానాల పెంపుతో జిల్లాల స్వరూపం మారే అవకాశం ఉంది. అయితే, 2029 నాటికే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందనే వాదన ఉన్నా... 20234 నాటికే అమలుకు అవకాశం ఉందనేది మరో అభిప్రాయం. దీంతో, ఈ ప్రక్రియ మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం మార్చటం లో కీలకంగా మారనుంది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi