అమరావతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కూటమి ఏడాది పాలన ఒక చారిత్రాత్మక ఘట్టం, ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పాలన చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం. ఏడాది పాలనపై అమరావతిలో ఏర్పాటుచేసిన తొలి అడుగు సదస్సులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు.
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి లోకేష్. హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు. ఈ సదస్సుకు హాజరైన వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు ఏడాది సంక్షేమంపై సమీక్ష, అభివృద్ధిపై అవలోకనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది.
మొదటి ఏడాదిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరించి రెండో ఏడాది లక్ష్యాలపై సమావేశంలో చర్చించారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా ఈ కార్యక్రమం జరగడం విశేషం. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై "సుపరిపాలనలో తొలి అడుగు" సమావేశం భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశిస్తుందని ఆహ్వానితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాల నుంచి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు.