డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు: మండలంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు, రాజకీయ దురంధరుడు సంగిత వెంకటరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు పూర్వ ఆలమూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఘనంగా జరిగాయి.
ఆలమూరు మండలంలోని పినపళ్ల గానుగు చెట్టు సెంటర్, కొత్తూరు జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న మాజీ మంత్రి సంగిత విగ్రహానికి ఆయన కుమారుడు, సంగిత గంగరాజు (పెదబాబు), గ్రామ సర్పంచ్ సంగిత సుభాష్ ఆధ్వర్యంలో అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే మండపేట, కపిలేశ్వరపురం మండలాల్లో జరిగిన వర్ధంతి వేడుకల్లో పెదబాబు, సుభాష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
మండపేట బస్టాండ్ సెంటర్ లో అంగర మెయిన్ రోడ్డులో నున్న మాజీ మంత్రి సంగిత విగ్రహానికి పూలమాలలు వేసి అ మహనీయుడు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈసందర్భంగా ఆయా మండలాల్లో అభిమానులు సేవా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ మంత్రి సంగిత అసువులు బాసి దశాబ్ద కాలం పూర్తయిన ఆయన పట్ల ప్రజలకున్న చెక్కుచెదర లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం మవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తల దేశం గర్వించే విధంగా తీర్చి దిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందంటూ ఆయన అభిమానులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వక్కపట్ల లక్ష్మణరావు, యేపూరి వీరబాబు, యనమదల శ్రీనివాస్, నామాల సుబ్బారావు, కపిలేశ్వరపురం జడ్పీటీసీ వట్టికూటి అబ్బు, జనసేన ఎంపీటీసీ పెద్దిరెడ్డి శేషారత్నం, అంగర సర్పంచ్ వాస కోటేశ్వరరావు, అంగర సొసైటీ మాజీ సర్పంచ్ గుడిమెట్ల రాంబాబు, అంగర మాజీ సర్పంచ్ స్వామికాపు, జిల్లా పీఎంపీ అధ్యక్షులు గంగుమళ్ల రాంబాబు, వంగా శ్రీనివాసరావు, యర్రంశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.